Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో జరిగే…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ…
హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు.
Champions Trophy 2025: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) తన జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నమెంట్ దేశం వెలుపల నిర్వహించబడుతుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఏ టోర్నీలోనూ పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడేందుకు అనుమతించేది లేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే…
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ విముఖత వ్యక్తం చేసినట్లు ఐసీసీకి తెలియజేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ధృవీకరించింది. ఐసీసీ ఈ-మెయిల్‌పై పీసీబీ స్పందించలేదు. ఐసీసీ నుండి ఏదైనా వ్రాతపూర్వకంగా అందినప్పుడే పాకిస్తాన్ తన విధానాన్ని వెల్లడిస్తుందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం చెప్పారు.
Champions Trophy 2025 Update: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఐసీసీకి పీసీబీ పంపిన షెడ్యూల్ ప్రకారం.. టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న, ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. లాహోర్, రావల్పిండి, కరాచీలను వేదికలుగా ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ టీమ్ హవా నడించింది. సొంతగడ్డపైనే కాక.. విదేశాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. 1992లో వన్డే ప్రపంచకప్, 2009లో టీ20 ప్రపంచకప్‌లను గెలిచింది. అలాంటి టీమ్ ప్రస్తుతం అనూహ్య ఓటములను ఎదుర్కొంటోంది. పసికూనల చేతుల్లో కూడా ఓడిపోతోంది. ఘన ప్రస్థానం నుంచి.. పాకిస్తాన్ పతనం వైపు వేగంగా అడుగులేస్తోందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఆట తీరు రోజురోజుకు పడిపోతోంది. టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడిన పాక్.. టీ20 ప్రపంచకప్…
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన చేసిన బాబర్ అజామ్, షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌ల కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. పీసీబీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తాజాగా స్పందించాడు. బాసిత్…