Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ మాటే నెగ్గింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో ఛాపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే కోచింగ్ బాధ్యతల నుంచి గ్యారీ కిరిస్టెన్ వైదొలగా.. తాజాగా జాసన్ గిలెస్పీ గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గిలెస్పీ పదవీకాలం 2026 వరకు ఉన్నా.. ముందే వైదొలగడం గమనార్హం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును కెప్టెన్, కోచ్‌ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. పీసీబీలో సరైన వారు లేకపోవడంతో కెప్టెన్, కోచ్‌లు తరచుగా మారుతున్నారు. Also…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఛాంపియన్స్…
2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు.
2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసిందని అనేక కథనాలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధతకు తెర పడినట్లు తెలుస్తోంది. ట్రోఫీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌లో నిర్వహించనుంది. అంతేకాదు 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్‌లో పాకిస్తాన్ పర్యటించకుండా.. హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2025 ఫిబ్రవరి, మార్చిలో…
ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. పాకిస్థాన్ ఆతిథ్యంలోనే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది. కానీ, పాక్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలతో అక్కడికి టీమిండియాను పంపించమని తేల్చి చెప్పింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2024పై ఉత్కంఠ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చివరకు ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే కండిషన్స్ పెట్టి ఓకే చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తే.. భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా తాము అదే మోడల్లో ఆడుతామని ఐసీసీకి పీసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో పీసీబీ పెట్టిన కండిషన్‌కు బీసీసీఐ కౌంటర్…
శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది.