Rachin Ravindra: ఈ ఏడాది పాకిస్తాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025ను ఆతిథ్యం ఇవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఆ దేశం ప్రతిపాదనలు, తయారీలు వివాదాస్పదంగా మారాయి. 24 సంవత్సరాల తరువాత పాకిస్తాన్‌లో ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టినప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇంకా సిద్ధతలకు సంబంధించి కొన్ని లోపాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ లో ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీరిస్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. గద్దాఫీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఘోరంగా గాయపడ్డాడు. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం, ఫ్లడ్ లైట్లు సరిగా పనిచేయకపోవడం కారణంగా రవీంద్ర బంతిని సరిగ్గా చూడలేకపోయాడు. ఈ కారణంగా బంతి అతని కంటి పక్కకు బలంగా తాకి, అతని ముఖం రక్తంతో నిండిపోయింది. దాంతో అతడిని గ్రౌండ్ నుండి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
A tough moment on the field for Rachin Ravindra as an attempted catch turned into an unfortunate injury. 🤕
Get well soon, Rachin! pic.twitter.com/34dB108tpF
— FanCode (@FanCode) February 8, 2025
ఇక మ్యాచ్ పరంగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ ను 78 పరుగుల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్ జట్టు 330/6 స్కోరు సాధించి పాకిస్తాన్ జట్టుకు భారీ లక్ష్యం పెట్టింది. ఇందులో ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్.. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తానికి 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 47.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇందులో ఫఖర్ జమాన్ 84 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. దానితో చివరికి న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఇంకా సరైన స్పందన రాలేదు. ఫ్లడ్ లైట్ సమస్యలు, తయారీ లోపాలు వంటి అంశాలు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పై పాకిస్తాన్ ను ప్రశ్నార్థకంగా నిలిపాయి.