ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే… ఆ వీడియోలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా భారత జాతీయ జెండా ఎక్కడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుండటంతో.. భారత జెండాను కరాచీలో ఎగురవేయలేదని చాలామంది భావించారు. ఈ వివాదం నేపథ్యంలో పీసీబీ వివరణ ఇచ్చింది. పాకిస్తాన్‌లో ఆడే జట్ల జెండాలు మాత్రమే ఎగురవేస్తామని పీసీబీ తెలిపింది. ‘2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారతదేశం తన మ్యాచ్‌లు ఆడటానికి పాకిస్తాన్‌కు రావడం లేదు. కరాచీలోని నేషనల్ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆ వేదికలలో ఆడబోయే దేశాల జెండాలను ఎగురవేసింది” అని పీసీబీ తెలిపింది. మరోవైపు.. బంగ్లాదేశ్ జెండా కూడా ఎగురవేయలేదు. బంగ్లాదేశ్ జట్టు ఇంకా పాకిస్తాన్‌కు రాలేదు.. దుబాయ్‌లో భారత్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఆ దేశపు జెండా కూడా ఎగురవేయలేదని పీసీబీ పేర్కొంది.
Read Also: AP High Court: పీఎస్‌లలో సీసీ కెమెరాలు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు..
టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు దుబాయ్ లో ఆడేందుకు పీసీబీ, బీసీసీఐ.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం 2025 మహిళల ప్రపంచ కప్, 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ ఇండియాకి వెళ్లదు. 2012-13లో పాకిస్తాన్ వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత్ కి వచ్చినప్పటి నుండి.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేవు. టీమిండియా చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించింది. అనంతరం 2016 టీ20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టును భారత్ స్వాగతించింది. అయితే, ఇండియా ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. కాగా.. పాకిస్తాన్ కూడా ఐసిసి ఈవెంట్స్ కోసం భారత్ కి వెళ్లడానికి నిరాకరించనుంది.