IND vs PAK: 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్‌ని బుధవారం ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) సమర్పించింది. మార్చి 1న లాహోర్‌లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Babar Azam preparing to take legal action against YouTubers: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ ఘోర పరాభవానికి తానే ప్రధాన కారణమంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు యూట్యూబర్లు, మాజీ క్రికెటర్లపై చర్యలు తీసుకోనునట్లు సమాచారం. ఇందులో పాక్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా జియో న్యూస్ పేర్కొంది. టీ20…
Gary Kirsten Comments on Pakistan Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్‌పై ఆ జట్టు చీఫ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ అసలు జట్టే కాదని, ఆ టీంలో ఐక్యత లేనే లేదన్నాడు. పాక్ జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, కొంతమంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపాడు. ఫిట్నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణం…
Pakistan confirm T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీలో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు జట్టులో చోటు దక్కడం విశేషం. ప్రదర్శన, ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను…
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే గడువు ముగిసినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాల కారణంగానే పాకిస్థాన్ జట్టును ఇంకా జట్టును ప్రకటించలేదట. తమ…
తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ లో ఆమె “నేను చాలా ఇష్టపడే క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించునున్నని.. ఇక ఇందులో నా 17 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఎన్నో విజయాలు, అలాగే అనేక మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందిని తెలుపుతూ.. తన క్రికెట్ ప్రయాణంలో మొదటి మ్యాచ్…
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కు మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ (Pakisthan Cricket Board). వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం.. పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత.. అతని స్థానంలో టీ20లకు షహీన్ అఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్లులో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మళ్లీ బాబర్ అజాంను మళ్లీ టీ20 కెప్టెన్ గా ప్రకటించారు. ఇంతకుముందు.. బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత.. షాహిన్ ఆఫ్రిదికి బాధ్యతలు అప్పగించారు. తన కెప్టెన్సీలో అనుకున్నంత విజయాలను సాధించకపోవడంతో బాబర్ కే పగ్గాలు అప్పజెప్పింది. ఇదిలా ఉంటే.. జట్టు హెడ్ కోచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంతో ఎదురుచూస్తుంది. ఇంతకుముందు కోచ్ పదవుల్లో ఉన్న…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో.. కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్‌లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.