PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల…
2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. Also…
ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని…
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే…
ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతోనే తాము ఆసియా కప్ 2025 నుంచి వైదొలగలేదు అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి వెల్లడించారు. పీఎం సహా చాలా మంది మద్దతు తమకు ఉందని, ఆసియా కప్‌ను బహిష్కరించాలనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుందన్నారు. తాము సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం అని చెప్పారు. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని తాము నమ్ముతున్నాం నఖ్వి తెలిపారు. నిజానికి టోర్నీ నుంచి వైదొలిగితే ఆర్థికంగా…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయన్ను టోర్నీ నుంచి తొలగించాలని ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. Also Read: Kribhco Chairman:…
ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పవర్‌హౌస్ అభిషేక్ శర్మ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 30 రన్స్ చేశాడు. చేసిన 30 పరుగులలో 26 రన్స్ బౌండరీల ద్వారానే వచ్చాయి. ఎలాంటి బెరుకు లేకుండా ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. అభిషేక్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దాయాది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కూడా అభిషేక్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు.…
ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతడు మెడ నొప్పితో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మీడియా జియో న్యూస్ పేర్కొంది. బుధవారం జరిగిన పాక్ ప్రాక్టీస్ సెషన్‌కు అఘా దూరంగా ఉన్నాడు. మిగతా ప్లేయర్స్ మాత్రం సాధనను కొనసాగించారు. పాక్ జట్టుతో కలిసి దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీకి వచ్చినా.. మెడకు బ్యాండేజ్ వేసుకొని కనిపించాడు. ఇందుకు…
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా…