పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్‌గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.
India Pakistan War: ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు జరిపిన పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధ సామర్థ్యం గల షాహీన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే, ఈ క్షిపణినీ భారతదేశం తన S-400 రక్షణ వ్యవస్థతో అడ్డుకుంది.
దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు.
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.
హర్యానా యూట్యూబర్, పాక్ గూఢచారి జ్యోతి మల్హాత్రా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ ముసుగులో ఆమె చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిని న్యాయస్థానం ఐదురోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో…
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
YouTuber Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన కేసులో అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలను తెలిపినట్లు హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్, చైనాను సందర్శించారని వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే పలువురు భారత్ వ్యతిరేక టెర్రరిస్టుల్ని హతమారుస్తున్న వీరు, తాజాగా లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్‌ని హతమార్చారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఇతడిని హతమార్చారు. భారత్‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మూడు ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక కుట్రదారుగా ఉన్నాడు.
Pakistan: ఆపరేషన్ సిందూర్‌తో ఎయిర్ బేసుల్ని కోల్పోయినా పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు. తాము భారత్‌పై గెలిచామంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. వీటి ద్వారా పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సంఘర్షణ తర్వాత భారత్ చేస్తున్న ప్రతీ విషయాన్ని పాకిస్తాన్ కాపీ కొడుతోంది. భారత్ ఏం చేస్తుందో, ఆ తర్వాత మేము కూడా అదే చేస్తామని పాకిస్తాన్ అంటోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ…