Pakistan: ‘‘అవును, భారత్ బ్రహ్మోస్‌తో మా ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది’’..ఒప్పుకున్న పాక్ ప్రధాని..
- అవును , భారత్ బ్రహ్మోస్‌తో మా ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది..
- తాము దాడి చేసే లోపే భారత్ క్షిపణులను ప్రయోగించింది..
- ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
- మిత్రదేశం అజర్ బైజాన్ పర్యటనలో షరీఫ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు.
Read Also: Delhi Alert: ఢిల్లీకి దుమ్ము తుఫాన్ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్‌లో ప్రస్తుతం షహజాబ్ షరీఫ్ పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ వ్యా్ఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ ఫీల్డ్ మార్షన్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం మే 10 ఉదయం ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే, తెల్లవారకముందే పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై భారత్ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్ ని ప్రయోగించిందని పాక్ ప్రధాని అన్నారు.
“మే 9-10 రాత్రి, భారత దురాక్రమణకు మేము తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాము. గుణపాఠం నేర్పడానికి ఫజ్ర్ ప్రార్థనల తర్వాత ఉదయం 4.30 గంటలకు మన సాయుధ దళాలు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ గంట రాకముందే, భారతదేశం మరోసారి బ్రహ్మోస్‌ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించింది, రావల్పిండిలోని విమానాశ్రయంతో సహా పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది” అని షరీఫ్ లాచిన్‌లో తన ప్రసంగంలో అన్నారు.
Read Also: PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
పాకిస్తాన్‌పై మే 10న భారత్ తీవ్ర దాడి చేసింది. భారత సైనిక స్థావరాలు, సివిల్ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణులని పాకిస్తాన్ ప్రయోగించిన తర్వాత, భారత్ పాక్ వైమానిక ఆస్తులే లక్ష్యంగా విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ అయిన రావాల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్‌తో పాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్ మరియు చునియన్‌లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసింది. స్కార్డు, భోలారి, జకోబాబాద్ మరియు సర్గోధాలోని వైమానిక స్థావరాలు కూడా విస్తృతంగా దెబ్బతిన్నాయి. మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!