Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!
- ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు కీలక వ్యాఖ్యలు
- పాకిస్థాన్‌పై భారత్ స్పష్టమైన విజయాన్ని సాధించిందని తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: మహానాడు తుస్సుమంది.. అంబటి సెటైర్లు
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. డ్రోన్ అండ్ క్షిపణి యుద్ధంలో భారతదేశం.. పాకిస్థాన్‌పై స్పష్టంగా గెలిచిందని అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో భారతదేశమే స్పష్టంగా విజయం సాధించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక త్రివిధ దళాల సామర్థ్యంపై కూడా అంతర్జాతీయ నిపుణులు ప్రశంసలు కురిపించారు. అనుకున్న లక్ష్యం పూర్తయ్యాక.. ప్రశాంతమైన సంయమనానికి భారత్ పూనుకోవడంపై కూడా అభినందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, కాల్పుల విరమణపై ముగ్గురు అంతర్జాతీయ నిపుణులు తేల్చిన తీర్పు ఇది.
ఇది కూడా చదవండి: Hyderabad: స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ. 150 కోట్లు స్వాహా..!
భారతదేశం.. పాకిస్థాన్‌లో భారీ స్థాయిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు. వాషింగ్టన్‌కు చెందిన విశ్లేషకుడు క్రిస్టోఫర్ క్లారీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తాను అనుకున్న లక్ష్యాలను ఎక్కువగా సాధించినట్లు తెలిపారు. ఏ విధంగా చూసినా భారత్.. పాకిస్థాన్‌పై చేయి సాధించిందని వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన క్షిపణులను భారత్ అడ్డుకోగలిందని పేర్కొన్నారు. భారత్‌కు నష్టాలు జరిగినట్లుగా ఏం కనిపించడం లేదని చెప్పారు.
ఇక లండన్‌కు చెందిన ప్రభావవంతమైన భద్రతా థింక్-ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (RUSI)కి చెందిన వాల్టర్ లుడ్విగ్ మాట్లాడుతూ.. భారత వైమానిక దళం ప్రారంభం నుంచి విశ్వసనీయంగా పని చేసిందని తెలిపారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ పూర్తిగా విజయం సాధించిందని పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిందని తెలిపారు. పాకిస్థాన్‌కు ఇతర దేశాలు అందించిన ఆయుధాలను కూడా భారత్ సమర్థవంతం ఎదుర్కొందని చెప్పారు.
ఇక వాషింగ్టన్‌కు చెందిన బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెలో అయిన జాషువా టి. వైట్ మాట్లాడుతూ.. భారతీయ ఆయుధాలు.. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించాయని కొనియాడారు. భారత త్రివిధ దళాలు.. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని, ఇతర వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి భారత్ కచ్చితమైన తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని పేర్కొన్నారు. ఇక భారతదేశం.. ఇతర దశాల మద్దతును వ్యక్తపరచడానికి ఇష్టపడలేదన్నారు. ఇక పాకిస్థాన్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా దిగజారిపోయిందని.. పాక్‌ను నమ్మే పరిస్థితి లేదని ముగ్గురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!