PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..
- ఇది న్యూ ఇండియా..
- పాక్ ఎయిర్‌బేసుల్ని నిమిషాల్లో నాశనం చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..
- ఉగ్రవాదం తలెత్తిన ప్రతీసారి అణిచివేస్తాం: ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Read Also: IPL 2025:’ఆర్‌సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బీహార్ గడ్డపై నుంచి నుంచి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టం, భూమి అంచుల వరకు వేటాడుతాం’’ అని ప్రకటించారు. ‘‘పహల్గామ్ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నేను బీహార్‌కు వచ్చాను మరియు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బీహార్ నేల నుండి దేశానికి హామీ ఇచ్చాను. వారికి ఊహకు అందని శిక్ష విధించబడుతుందని నేను చెప్పాను. ఇప్పుడు నేను బీహార్‌కు తిరిగి వచ్చాను, నా వాగ్దానాన్ని నెరవేర్చాను. పాకిస్తాన్‌లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్తాన్, ప్రపంచం సిందూర్ శక్తిని చూసింది’’ అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఉగ్రవాదం తిరిగి తలెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా దానిపై దాడి చేస్తూనే ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో శత్రువులు భారత్ బలాన్ని చూశారు. మన అంబులపొదిలో ఒకే ఒక బాణం ఉందని అర్థం చేసుకోవాలి, ఉగ్రవాదం ముగిసే వరకు ఈ పోరాటం ముగియదు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, భారత్ దానిని అణిచివేస్తుంది’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?