Amit Shah: యుద్ధ బాధితులకు అండగా ఉంటాం.. కాశ్మీర్ టూర్‌లో అమిత్ షా భరోసా
- జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో అమిత్ షా పర్యటన
- యుద్ధ బాధితులకు అండగా ఉంటాం
- కాశ్మీర్ టూర్‌లో అమిత్ షా భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు. పాక్ షెల్లింగ్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు నియామక పత్రాలను అందజేశారు.
ఇది కూడా చదవండి: Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానం..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రజలను టార్గెట్‌గా చేసుకుని పాక్ దాడులు చేయడం గర్హనీయమన్నారు. పాక్ దాడుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం, ప్రజల సంఘీభావం ఉంటుందని.. యావద్దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజలు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యావద్దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని.. ఏ ఉగ్రవాద చర్యను ప్రధాని మోడీ ఉపేక్షించరని చెప్పారు.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం, త్రివిధ దళాల అసమాన ప్రతిభ వల్లే పాకిస్థాన్‌పై చేసిన ఆపరేషన్ సిందూర్ సక్సె్స్ అయిందని తెలిపారు. వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. కేవలం ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేశామని.. ప్రజలకు ఏ మాత్రం హాని తలపెట్టలేదని పేర్కొన్నారు. పాకిస్థాన్ మాత్రం.. మన జనావాసాలపై వైమానిక దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. దీంతో పూంచ్ ప్రాంతంలో బాగా నష్టం జరిగిందని.. గురుద్వారాలు, మదర్సాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీనికి ప్రతీకారంగా మే 9న పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై మన దళాలు దాడి చేశాయని అమిత్ షా చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
#WATCH | Poonch | Union Home Minister Amit Shah distributes appointment letters to the families of those affected by Pakistan's shelling during Operation Sindoor. pic.twitter.com/kNyRq4Epfm
— ANI (@ANI) May 30, 2025
#WATCH | Poonch | Union Home Minister Amit Shah says, "…Pakistan targeted civilian areas, religious places. Appointment letters have been given to the families of those affected by Pakistan's shelling during Operation Sindoor…This is a sign that the J&K government, central… pic.twitter.com/7q4kQseiSv
— ANI (@ANI) May 30, 2025
#WATCH | Union Home Minister Amit Shah meets the families affected by cross-border shelling by Pakistan in Poonch, J&K. pic.twitter.com/tEkFpHFu1d
— ANI (@ANI) May 30, 2025
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!