R-37M missile: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో, ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా, భారత్‌కి డెడ్లీ మిస్సైల్‌ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, రష్యా తన లేటెస్ట్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57ని కూడా అందిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు R-37M హైపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ క్షిపణిని అందించేందుకు పుతిన్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ వద్ద ఉన్న Su-30MKI ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చాలనే ఆలోచన దీని వెనక ఉన్నట్లు తెలుస్తోంది.
R-37M 300 నుంచి 400 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. నాటో కూటమి ఈ క్షిపణని AA-13 ఆక్స్‌హెడ్‌గా పిలుస్తుంది. ఇది మాక్-6 వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బియాండ్ విజువల్ రేంజ్(BVR) క్షిపణుల్లో ఒకటి. విజువల్‌గా ఈ క్షిపణిని ట్రాక్ చేయాల్సిన అవసరం లేకుండా గాలిలో శత్రువుల టార్గెట్‌లను కొట్టే సామర్థ్యం దీనికి ఉంది.
R-37M క్షిపణి ఫీచర్లు ఇవే:
* దీనిని రష్యాకు చెందిన వైంపెల్ డిజైన్ బ్యూరో డెవలప్ చేసింది.
* ఇది ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ (AWACS), ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు శత్రు ఫైటర్ జెట్‌లు వంటి వైమానిక లక్ష్యాలను నాశనం చేసే సత్తా కలిగి ఉంది.
* R-37M క్షిపణికి జెట్టిసనబుల్ రాకెట్ బూస్టర్ ఉంటుంది. ఇది క్షిపణి 300-400 కి.మీ పరిధి సాధించేందుకు సాయపడుతుంది.
* R-37M క్షిపణి యొక్క హైపర్సోనిక్ వేగం మాక్ 6 (సుమారు 7,400 కి.మీ/గం) తో ప్రయాణిస్తుంది.
* ఫాస్ట్ మూమింగ్ టార్గెట్‌లను కొట్టేందుకు దీని ఉన్న స్పీడ్ సహాయపడుతుంది. దీని నుంచి శత్రు టార్గెట్లు తప్పించుకోవడం చాలా కష్టం.
* క్షిపణి బరువు 510 కిలోలు. దీంట్లో అధునాతన గైడెడ్ సిస్టమ్, యాక్టివ్ రాడార్ హోమింగ్, టెర్మినట్ ఫేజ్ నావిగేషన్ ఉన్నాయి.
* R-37M క్షిపణులను Su-30, Su-35, Su-57, MiG-31BM, MiG-35 ఫైటర్ జెట్లలో అమర్చవచ్చు.రష్యా దీనిని భారతదేశపు Su-30MKI ఫైటర్ జెట్‌ల కోసం ఆఫర్ చేసింది.