Pakistan: ఒకే వేదికపై లష్కరే ఉగ్రవాదులతో మంత్రులు.. పాక్ టెర్రర్ లింకులు బహిర్గతం..
- పాకిస్తాన్ టెర్రర్ లింకులు బహిర్గతం..
- ఒకే వేదికపై పాక్ మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు..
- భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు..
- ర్యాలీలో పాల్గొన్న పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ లకు అత్యంత సన్నిహితులు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైఫుల్లా కసూరి, తల్హా సయీద్ (హఫీజ్ సయీద్ కుమారుడు) మరియు అమీర్ హంజా వంటి వారితో వేదికను పంచుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశంపై విషం కక్కారు. నిఘావర్గాలు ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరిని భావిస్తున్నారు.
Also Read
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Read Also: Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్‌ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..
మంత్రి మాలిక్ రషీద్ మాట్లాడుతూ.. నేడు 24 కోట్ల మంది పాకిస్థానీలకు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని బహిరంగంగానే ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి జరిపింది. దీంతో మురిడ్కే కూడా ఒకటి. మురిడ్కే దాడిలో కీలకమైన ఉగ్రవాది లష్కర్ కమాండర్ ముదాసిర్ హతమయ్యాడు. ఇతడి సోదరుడికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని కూడా ఆయన ప్రకటించారు.
సైఫుల్లా కసూరి మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సూత్రధాని అని నన్ను నిందించారు, ఇప్పుడు నా పేరు ప్రపంచానికి తెలిసిందని అని గర్వంగా చెప్పుకున్నాడు. కసూరీని పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షిస్తోంది. ఈ కార్యక్రమంలో భారత వ్యతిరేక, ఖలిస్తానీ అనుకూల నినాదాలు ప్రతిధ్వనించాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ఉగ్రవాది అమీర్ హంజా వేదికపై నుంచి ఖలిస్తానీ అనుకూల నినాదాలను లేవనెత్తాడు. భారత్‌లో ఖలిస్తాన్ పేరుతో అశాంతిని రెచ్చగొట్టాలనే కుట్రకు తెరలేపాడు. మరోవైపు, రావల్పిండిలో జరిగిన ర్యాలీలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలను ప్రదర్శించారు.
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!