Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పోషించడంలో పాకిస్తాన్‌కి సుదీర్ఘమైన చరిత్ర ఉందని అన్నారు. పాకిస్తాన్ మానవాళికి ముప్పుగా మారిందని విమర్శించారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలకు తెలిసేలా 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు.
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన హిందూ ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని ‘‘హింగ్లాజ్ మాతా’’ ఆలయంపై ఆసక్తి నెలకొంది. హిందూ మతంలోని 51 శక్తి పీఠాల్లో హింగ్లాజ్ శక్తిపీఠ్ కూడా ఒకటి. బలూచిస్తాన్ ప్రావిన్సులోని మారుమూల కొండల్లో ఈ ఆలయం నెలకొని ఉంది. సింధ్, బ
Balochistan: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీకి చుక్కులు చూపిస్తోంది. బలూచిస్తాన్‌లో పనిచేసేందుకు పాక్ ఆర్మీ వణికిపోతోంది. తాజాగా , బలూచ్ యోధులు 5 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pakistan: తాను అడుక్కుతిన్నా మంచిదే కానీ, భారత్ ఎదగకూడదు, ఏదో విధంగా ఇండియాను చిరాకు పెట్టాలనేదే దాయాది దేశం పాకిస్తాన్ ఉద్దేశ్యం. భారత్‌తో నేరుగా తలపడే బలం లేక వెనక నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. పాక్ ప్రజలు ఆకలి కేకలు, నిత్యావసరాల కోసం బాధ పడుతుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదం కోసం,
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని…
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థపై పోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైన్యానికి మరింత ప్రోత్సాహం అందించాలని కేంద్రం యోచిస్తోంది.