అక్కడ ఎమ్మెల్యేకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ చూపిస్తోంది కూడా సొంత కేడరే కావడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదట. పార్టీ అధిష్టానం దగ్గర పరువు పోతోందిరా.. ప్లీజ్… ఈసారికి కో ఆపరేట్ చేయండర్రా… అని బతిమాలుకుంటున్నా… డోంట్ కేర్,… ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏ గాడిదలు కాసిందని ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారట. అంతలా ఇరకాటంలో పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటాయన బతిమూలుడు, బామాలుడు యవ్వారం? కొమురం భీం జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం…
నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా…
2019 ఎన్నికల్లో పడమరలో ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరిగింది! ఇప్పుడు ఒకటో నంబర్లో పెట్టినట్టుగా ఉంది! రెక్కలుగా ఉన్నవాళ్లంతా సైడయ్యారు! గాలిరాక కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోంది! గ్రంధి రందితో పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్. ఆచంట లీడర్ ఏచెంత ఉన్నారో తెలియక అయోమయం! ఆళ్ల కాళీ కృష్ణ వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకమైనవి. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్‌గా గెలుపును…
కులబలం, ధనబలం, పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఈ లెక్కలన్నీ వేసినా.. ఓ పాతిక ముప్పయ్ కోట్లు చేతిలో ఉండాల్సిందే! ఆ మాత్రం బరువు లేనిదే ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు! ఈ సంగతి అందరికీ తెలుసు. అలాంటి సినారియోలో ఓ ఇద్దరికి సామాన్యులకు టికెట్స్ ఇచ్చారా అధినేత. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇద్దరూ ఓడిపోయారు! తర్వాత మాయమయ్యారు! ప్రయోగం వికటించినా ఇంతవరకు విరుగుడు మంత్రమేంటో అధినేత చెప్పడం లేదట. Off The Record…
జమ్మలమడుగులో కొత్త జాతర మొదలైంది! అదేనండీ.. పొలిటికల్ జాతర! ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క..! అన్నొచ్చాడని చెప్పండని ఆయన తొడగొడుతున్నాడు! ఇన్నాళ్లున్న సైలెంటుగా ఉండి ఇప్పుడొక్కసారిగా జై జమ్మలమడుగు అన్నాడు. మరి ఇంతకాలం చక్రం తిప్పిన ఇంకో లీడర్ ఎక్కడ? ఆయన ఎటు వెళ్లారు? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలస్తారు.. ఓడుతారు! ఫీల్డులో ఉండాలి.. ఫైట్ చేయాలి! ఎవరైనా ఇదే సూత్రంతో రాజకీయాలు నడుపుతుంటారు. కానీ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డికి…
బీఆర్ఎస్-ధూంధాం! ఈ రెండు మాటలన్ని విడదీసి చూడలేం! ఉద్యమం కాలం నుంచి పదేళ్ల ప్రభుత్వం వరకు! పోరాటంలో అది ధూంధాం! సర్కారులో అది సాంస్కృతిక సారథి! ఇప్పుడా డప్పుచప్పుడు ఏమైంది? పాట ఎందుకు ఆగిపోయింది? గొంగడి కప్పుకుని గజ్జె కట్టేదెవరు? చిర్రా చిటికెన పుల్లతో డప్పు వాయించేదెవరు? ఎగిరి దుంకిన ఆ రోజులెక్కడ? సాయిచంద్ మృతి సరే! మరి రసమయి శ్రుతి ఏది? టీఆర్ఎస్ అయినా.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందినా, ఆ పార్టీ డప్పుచప్పుడుగా, వెన్నుదన్నుగా నిలబడ్డది…
ఏమాటకామాటే! గత పదేళ్లుగా గజ్వేల్ అంటే గజ్వేలే! ఎక్కడా తగ్గేదే అన్నట్టుగా ఉండేది! కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత ఇలాఖా ఆమాత్రం ఉండొద్దా! మరి ఇప్పుడు ఆ జిగేల్ ఏమైంది? కేసీఆర్ ఎక్కడున్నారు? ఇదే అంశాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంది! కేసీఆర్ కనిపించడం లేదంటూ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చింది! దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ ఏం చేసింది? ఛలో చూద్దాం రండి! గజ్వేల్ నియోజకవర్గం. దీనికి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖా!…
అంతన్నాడింతన్నాడు…. గెలుపు నాదే… ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వండి.. చూపిస్తా నా తడాఖా అంటూ గొప్ప గొప్ప డైలాగ్‌లు చెప్పేశాడు. వీర లెవల్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ చూసి.. అమ్మో… ఈయనతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రత్యర్థులు సైతం ఆలోచనలో పడ్డారట. కానీ… ఒక్కటంటే ఒక్క షాక్‌తో సీన్ మొత్తం మారిపోయింది. ఓస్… ఇంతేనా అంటూ తేలిపోయిన ఆ పొలిటీషియన్ ఎవరు? ఏంటాయన రివర్స్ గేర్ స్టోరీ? విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అంతకు…
ఉమ్మడి రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొలిటికల్ హిట్ లిస్ట్‌లో ఉన్నారా? సీఎం పదేపదే కొందరి పేర్లు ప్రస్తావించి మరీ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? దాని వెనక భవిష్యత్ వ్యూహం ఉందా? లేక ప్రస్తుత పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలతో హైడ్రా పై వ్యతిరేకత వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోందా? అసలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం అవుతున్నారట. గడిచిన పది…
బీఆర్ఎస్ అధిష్టానానికి జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయా? దెబ్బ ఎక్కడ పడిందో ఇన్నాళ్ళకు తెలిసొచ్చిందా? కోలుకోవడం కోసం మొదలుపెట్టిన ప్యాచ్ వర్క్ ఏంటి? అది ఎంత వరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అసలు బీఆర్ఎస్ పోగొట్టుకున్నది ఎక్కడ? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటోంది ఆ పార్టీ? తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56 శాతం. ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడంవల్లే… పవర్‌కు…