ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్ మేకర్ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా? వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా…
మంత్రుల గొంతు మూగబోయిందా?పార్టీ, ప్రభుత్వంపై ఆ రేంజ్లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా?అప్పోజిషన్ గ్యాప్ కూడా ఇవ్వకుండా సర్కార్‌పై ఎటాక్ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు?చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా…అసలు ఉపయోగమే లేకుండాపోయిందా?రాజకీయ పదవులు అనుభవిస్తూ…పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు..తిట్టింది మమ్మల్ని కాదుగా అనుకుంటున్నట్టున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం…చూశారా?ఎవరు మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ…
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు…
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పదవుల పంపకాలు గొడవలకు దారితీస్తున్నాయా? జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు ఎందుకంత గిరాకీ ఏర్పడింది?పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే ఉన్నట్టుండి ప్రాధాన్యత పెరుగుతోందా?పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెడుతున్నదెవరు?ఇంతకీ…ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?పదవుల కోసం పోటీ పడుతున్న నేతలెవరు?అసలు…గొడవలకు కారణం అవుతున్న ఆ పదవులేంటీ? ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో పదవులు ఆశించే నాయకుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందట. మరీ…
సర్పంచ్ల సన్మాన సభ ఆ నియోజవర్గంలోని ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టిందా?సన్మాన సభను వాయిదా వేయడం వెనుక అసలు కారణం ఏంటి?ఈ వివాదం మరింత ముదురుతోందా?ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బీఆర్ఎస్లో కీలక నేతల మధ్య లొల్లి ముదురుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులను గెలిపించుకోవడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యింది. మాజీమంత్రి హరీశ్ రావు, గజ్వేల్ నియోజకవర్గ నేతలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ…
తెలంగాణలో రాజకీయం ఈ రేంజ్లో హీటెక్కటానికి కారణం ఏంటి?నీతి…జాతి అనే పదాల చుట్టూనే స్టేట్ పాలిటిక్స్ తిరుగుతున్నాయా?పొలిటికల్ లీడర్స్ పరుషంగా మాట్లాడటం దేనికి సంకేతం?పరస్పర దూషణలు రాజకీయ యుద్ధంగా మారుతున్నాయా?ఆ రెండు కులాల మధ్య రాజకీయం సంకుల సమరంగా మారిందా?రాష్ట్రంలో క్యాస్ట్ పాలిటిక్స్ ఇంతలా ఫ్రంట్ లైన్లోకి రావటానికి రీజనేంటి? తెలంగాణ పాలిటిక్స్ పీక్స్‌కు వెళ్తున్నాయి. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో దూషణల పర్వం బాగా ఎక్కువైపోయింది. ఒక అంశాన్ని…సీరియస్‌గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నాయకులు తిట్లను ఎత్తుకుంటున్నారు.…
ఆరు నూరైనా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఒకరు, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్… గట్టి పనేదో చేసి చూపవోయ్ అంటూ మరొకరు. అక్కడ కారు పార్టీలో కాక రేపుతోంది. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు గెల్చుకున్న ఆనందం లేకుండా బీఆర్ఎస్ పెద్దల్ని కంగారు పెడుతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఇద్దరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు ఎక్కువ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటి సిర్పూర్. ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే…
సంచలనం రేపుతున్న కేసులో ఆ సీనియర్ ఐఎఎస్ అధికారిని విచారించకుండా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదెవరు? కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఎందుకు మోకాలడ్డుతున్నారు? కేంద్రం అనుమతి ఆలస్యం అవుతోందని సాక్షాత్తు సీఎం అనడంలో ఆంతర్యం ఏంటి? ఏ ఆఫీసర్ విషయంలో అలా జరుగుతోంది? అసలు దర్యాప్తు ముందుకు వెళ్తుందా? లేదా? ఫార్ములా ఈ కార్ రేస్ కోసం అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేశారనే అభియోగం మీద తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై…
అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యామ్‌తో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరు ఎవరికి చెక్‌మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యామ్‌లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు…
తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మంటలు మండబోతున్నాయా? బీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టేసిందా? పాత సీసాలో కొత్త నీళ్ళు పోసి సరికొత్తగా పొలిటికల్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోందా? అసలు ఏ సెంటిమెంట్‌ని తిరిగి రగల్చ బోతోంది గులాబీ పార్టీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి రావాలన్న ప్లాన్‌లో ఉంది బీఆర్ఎస్. ఇంకా మూడేళ్ళ టైం ఉన్నందున ఇప్పట్నుంచే మొదలుపెడితే……