పవన్‌కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీలవుతోందా? దీన్ని ఇంకా సాగదీస్తే… ఓ వర్గం కంప్లీట్‌గా దూరమవుతుందన్న భయం పార్టీలో పెరిగిపోతోందా? అందుకే అదుపు… అదుపు… మాట పొదుపు అన్న వార్నింగ్స్ వెళ్తున్నాయా? ఆయన్ని చీల్చి చెండాడేద్దామని అనుకుంటే… మనకింకా చీరుకుపోయేట్టుందని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారా? అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటి? పార్టీ ముఖ్యుల అభిప్రాయం ఎలా ఉంది? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరి ఇన్నాళ్ళు…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రమంతటా పర్యటించాలనుకుంటున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తోందా? అతి త్వరలోనే ఆమె యాక్టివ్‌గా తిరగబోతున్నారా? కవిత రీ ఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి? అందులో నిజమెంత? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత… ఇకపై బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ..ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే… ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న…
పార్టీ మేనిఫెస్టోతో సంబంధం లేకుండా సొంత స్కీమ్స్ ప్రకటించేశారా ఎమ్మెల్యే. నన్ను చూసి ఓటెయ్యండి, నా పథకాల్ని చూడండి. 150 కోట్లు ఖర్చయినా సరే… సొంత ఆస్తుల్ని అమ్మి అయినా సరే… నియోజకవర్గాన్ని నందనవనం చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. గెలిచినా, ఓడినా ఆరు నెలల్లో అన్నీ మొదలుపెడతానన్న లీడర్.. తీరా గెలిపించి 9 నెలలు అవుతున్నా ఆ ఊసేలేదట. నియోజకవర్గ ప్రజలు రివర్స్ అవుతున్నారని భయపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటి ఆయన సొంత హామీలు? కామారెడ్డి…
తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రం దొరికిందా? దాంతోనే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్‌లో ఉందా? అందుకే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేసిందా? కాషాయ నేతల వరుస స్టేట్మెంట్స్ ఈ విషయమే చెబుతున్నాయా? ఇంతకీ బీజేపీకి దొరికిన ఆ అస్త్రం ఏంటి? ఏ పేరుతో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు? ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి.. ఐదున్నర నెలలపాటు జైల్లో ఉండి.. ఇటీవలే బయటికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అదంతా గతం. అయితే…
కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు….. బంపరాఫర్లు తగులుతున్నాయా? మీ పంట పండింది పోండి… ఇక పండగ చేస్కోండి… మంచి తరుణం మించిన దొరకదంటూ వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు? అసలు కడప జిల్లా పరిషత్‌లో ఏం జరుగుతోంది? జడ్పీటీసీలకు ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి? ఖాళీ అయిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టిడిపి ఇటు వైసీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జడ్పీలో టిడిపికి బలం లేకున్నా…వలసల్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకుంటున్నట్టు…
కేసీఆర్ ట్రెండ్ మార్చబోతున్నారా? ఇక దూకుడు పెంచబోతున్నారా? అందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారా? దాని ప్రభావంతో కేడర్‌లో ఊపు వస్తుందా? ఎన్నికల ఫలితాలు, వలసలతో డీలాపడ్డ గులాబీ దళంలో ఉత్తేజం నింపడానికి కేసీఆర్ అందించబోతున్న ఆ చవన్ప్రాస్ ఏంటి? దాని ప్రభావం నిజంగానే ఆ రేంజ్లో ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో…
వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా? ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్లో ఉన్నారన్నది నిజమేనా? ఈ రాజీనామాల పరంపరపై పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంది? వెళ్ళే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా? లేక పోతేపోనీ అనుకుంటున్నారా? జంపింగ్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? రెండు నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరుసబెట్టి సమ్మెట…
ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వమా? లేక వైసీపీ సర్కారా? ఏంటా పిచ్చి ప్రశ్న, అసలు మీకా డౌట్ ఎందుకొచ్చిందని అంటారా? డౌట్ మాది కాదు. టీడీపీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్స్ది. అప్పుడెప్పుడో 2014-19 మధ్య కాలంలో తాము చేసిన పనులకు బిల్లులు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వైసీపీ హయాంలో చేసిన పనులకు అందునా పులివెందుల కాంట్రాక్టర్స్‌కు వందల కోట్లు ఇచ్చేస్తే డౌట్ కాక ఇంకేం వస్తుందని అంటున్నారు వాళ్లు. ఏంటా చెల్లింపుల వ్యవహారం? దాని వెనక…
ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు పార్టీకి పట్టున్న జిల్లాలో క్రమంగా అంధకారం అలముకుంంటోందా? పక్క పార్టీల్లోకి క్యూ కట్టే నేతల సంఖ్య పెరుగుతోందా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పక్కకు జరగ్గా… జిల్లాలో పార్టీకి ఆయువుపట్టు లాంటి నేత కూడా బైబై చెప్పేస్తారా? ఇన్నాళ్ళు ఖండించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాటను చెప్పకనే చెప్పారా? ఇంత జరుగుతున్నా సెట్ చేయగలిగిన ట్రబుల్ షూటర్లేని ఆ జిల్లా ఏది?…
తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీ హై కమాండ్‌నే భయపెడుతున్నారా? వాళ్ళు పర్మిషన్ అడిగితే ప్రస్తుతానికి కామ్‌గా ఉండమంటూ దండం పెట్టేస్తున్నారా? ఏ విషయంలో ఢిల్లీ పెద్దలు అంతలా భయపడుతున్నారు? అసలు ఇక్కడి నాయకులు ఏ మేటర్‌లో ఢిల్లీ పెద్దల పర్మిషన్ అడిగారు? రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చేరికలతో నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అంతకు ముందు రాష్ట్ర పార్టీలో ఒకరిద్దరు,…