తెలంగాణలో అధికార పార్టీ నేతలకు అధికారులే టార్గెట్ అయ్యారా? సీఎం, పీసీసీ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి ఎందుకు అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా… అధికార యంత్రాంగం మీద గ్రిప్ రాలేదా? లేక ప్రభుత్వ సిబ్బందే కాంగ్రెస్ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా? సర్కార్‌లో అసలేం జరుగుతోంది? తెలంగాణలో అధికారుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ దాకా ఎవరూ సక్రమంగా పనిచేయడం లేదని అధికార పార్టీ నాయకులే…
ఆ టీడీపీ ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయారా? తనకున్న ఏవేవో రాజకీయ అసంతృప్తుల్ని సెగ్మెంట్ మీద చూపిస్తున్నారా? దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా….. ఆయనగారి తమ్ముడు గారు చెలరేగిపోతున్నారా? ఎమ్మెల్యే కాదు… అంతకు మించి అన్నట్టు అనధికారిక దర్పం ఒలకబోస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఆయన షాడో? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు మాజీ మంత్రి కొండ్రు మురళీమెహన్. ప్రస్తుతం తాను సిట్టింగ్గా ఉన్న…
పాలకుర్తి కాంగ్రెస్‌లో రచ్చకు కారణం ఎవరు? సొంత పార్టీ నేతలేనా? లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? కాంగ్రెస్‌లో ఉంటూ పక్క పార్టీకి కోవర్ట్‌లు పనిచేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇంతకూ ఆసలు పాలకుర్తి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఓ రేంజ్లో జరుగుతోంది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా మొదలైన ఫిర్యాదుల పరంపర గాంధీ భవన్ వరకు చేరింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి పొలిటికల్ సీనియర్ని…
ఆ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ ప్రయోగం పూర్తిగా వికటించిందా? అదీ… అలా ఇలా కాకుండా… ఇప్పుడసలు ఏకంగా పార్టీకి నాయకుడే లేకుండా పోయాడా? రండి బాబూ… రండని ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నా, ఖాళీ కుర్చీని చూపిస్తున్నా… అందులో కూర్చునే వాళ్ళు కరవయ్యారా? ఎక్కడ…. అంత సెల్ఫ్‌గోల్ వేసుకుంది వైసీపీ? కులాల ఈక్వేషన్స్ ఎలా దెబ్బతీశాయి? రాజకీయంగా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగిన లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. 2019ఎన్నికల్లో ఈ…
అమ్మోరి సాక్షిగా…. ఆ ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? ఓ నామినేటెడ్ పోస్ట్ విషయమై పంతాలకు పోతున్నారా? ఇచ్చిన జీవోనే నిలిపివేయించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరి మధ్య మరో మంత్రి నలిగిపోతున్నారన్నది నిజమేనా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎవరా ముగ్గురు మంత్రులు? భద్రాద్రి జిల్లా పాల్వంచ పెద్దమ్మ టెంపుల్ ఛైర్మన్ నియామకం పొలిటికల్ రంగు పులుముకుంది. అదీకూడా అలాఇలా కాదు. ఆ పోస్ట్‌ని తమ అనుచరులకు ఇప్పించేందుకు అగ్రనాయకులే పావులు…
ఆ ఉమ్మడి జిల్లాలో తగ్గదే…లే… అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. మీరు మర్చిపోదామనుకున్నా… మేం పోనివ్వమంటూ… సోషల్ మీడియా తవ్వకాలు జరిపి పాత వీడియోల్ని వెదికి పట్టుకుని మరీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారట. నాడు మమ్మల్ని ఓ ఆటాడేసుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదులుతామా అని అంటున్నారట. ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? టీడీపీ లీడర్స్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? పవర్లోకి వచ్చాక పగ…పగ… అని రగిలిపోతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు? పక్కా సమాచారంతోనే అన్నారా? లేక ఓ రాయి వేసి చూద్దామనుకున్నారా? ప్రభుత్వంలో గులాబీ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారన్నది నిజమేనా? కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే ఒకరిద్దరు మంత్రులు నేరుగా ప్రతిపక్ష ముఖ్యుడికి ఫోన్ చేసి చెబుతున్నారన్నది నిజమేనా? అసలు తెలంగాణ సర్కార్‌లో ఏం జరుగుతోంది? రేవంత్ ఏమన్నారు? సీఎల్పీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్…
ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేని ప్రతిపక్ష నేతలు ఇరుకున పెట్టడం కామన్. కానీ... అక్కడ మాత్రం స్వపక్షంలోనే విపక్ష తయారైందట. మా ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు... ఇలా చేసేస్తున్నాడు. నియోజకవర్గంలో ఫలానా ఘోరం జరిగిపోతోందని అంటూ.. పార్టీ పెద్దలకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారట.
Off The Record: చిత్తం చెప్పుల మీద- భక్తి భగవంతుడి మీద అన్నట్టుగా ఉంది తెలంగాణలో కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. జంప్ అయిన పార్టీలో ఉండలేక, పాత పార్టీలోకి తిరిగి వెళ్ళలేక కుమిలిపోతున్నారట.
Off The Record: వాళ్ళిద్దరూ అధికార పార్టీ లీడర్స్. పైగా గతంలో ముఖ్యమైన పదవులు నిర్వహించినవారే. కానీ... ఇప్పుడు పవరున్న పార్టీలో ఉండి కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అవసరమైతే అధికారులను, పాలకులను నిలదీయండని జనానికి సలహా ఇస్తున్నారు.