Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. 26 మందిని మతం పేరుతో చంపేశారు. ఈ సంఘటన భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Rajnath Singh: నేడు విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. దీనితో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ శక్తి మరింతగా పెరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత సాంకేతిక సామర్ధ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి. Ganesh Idol Trunk: గణపయ్య…
Parliament Monsoon Session: ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి పెద్ద నిరనయాలు తీసుకున్నట్లుగా కనపడలేదు. 21 జూలైన మొదలైన ఈ వర్షాకాల సమావేశాలు 21 ఆగస్టున ముగిశాయి. ఈ సమావేశలలో లోక్‌సభ 120 గంటల చర్చ జరగాల్సి ఉండగా కేవలం 37 గంటలే చర్చ జరిగింది. మిగతా 83 గంటలు వృథా అయ్యాయి. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా 47 గంటల పని మాత్రమే జరగగా 73 గంటలు వృథా…
Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ.. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది.. భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. మరోవైపు, భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది విజయం మనదే అంటూ.. ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్)…
ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Jaish-e-Mohammed: పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని మరోసారి పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ…
ఢిల్లీలో నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరై ప్రసంగించనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి సభ సజావుగా సాగడం లేదు.