మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో హాట్‌హాట్‌గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు.
Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
P Chidambaram: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్‌పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని…
Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానికిగా ఉన్న వాజ్‌పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని…
Fans Urge Asia Cup 2025 Boycott Over India vs Pakistan Clashes: 2025 ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో సెప్టెంబరు 14, 21 తేదీల్లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీక ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో జరుగుతాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అవసరమా?, ఆసియా కప్ 2025…
Operation Sindoor: లోక్‌సభలో రేపటి (జూలై 28న) నుంచి ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం.
PM Modi: తమిళనాడు అభివృద్ధి మా ప్రధాన నిబద్ధత అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తూత్తుకూడి ఏయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ని ఆయన శనివారం ప్రారంభించారు. గత దశాబ్ధంతో పోలిస్తే, ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కన్నా ఎక్కువ నిధుల్ని తమిళనాడుకు ఇచ్చిందని అన్నారు. ఒ
NCERT: పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్‌తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’ వెళ్లిన మిషన్లు పాఠ్యాంశాలుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT)లో చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.