Operation Sindoor: పాక్ F-16, J-17 ఫైటర్ జెట్‌లు ధ్వంసం చేశాం.. 300 కి.మీ లోపల దాడులు చేశాం..
- పాక్ F-16, J-17 ఫైటర్ జెట్‌లు ధ్వంసం చేశాం..
- 300 కి.మీ లోపల దాడులు చేశాం..
- సంచలన విషయాలను వెల్లడించిన ఏపీ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సైన్యం చేసిన దాడి గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా తయారీ F-16, చైనీస్ J-17లను భారత్ కూల్చివేసిందని శుక్రవారం వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. పాకిస్తాన్ తన పౌరుల్ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారత్ జెట్లను నాశనం చేశామనే పాక్ వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ స్వయంగా భారత్‌ను కాల్పుల విరమణ కోరిందని చెప్పారు.
Read Also: Taliban: భారత్‌కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్‌కు రుచించని పరిణామం..
Also Read
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. ‘‘ ఆపరేషన్ సిందూర్‌లో, అమాయక ప్రజలను చంపినందుకు ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోవడం మీరు చూశారు. మేము మా లక్ష్యాన్ని సాధించిన విషయాన్ని ప్రపంచం చూసింది. మేము పాకిస్తాన్ లోపల 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించాము. ఆపై వారు (పాకిస్తాన్) కాల్పుల విరమణను కోరారు’’ అని ఏపీ సింగ్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే తానే యుద్ధాన్ని ఆపానని చెప్పిన విషయాలు తప్పని ఏపీ సింగ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది. రాబోయే యుద్ధాలు, మునుపటి కన్నా భిన్నంగా ఉంటాయని, ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు (SAMలు) నిర్ణయాత్మకంగా మారాయని అన్నారు.
తాజావార్తలు
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
-
BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!