Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
Pakistan: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’ ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు.
Pak PM: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వైట్ హౌజ్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు.
CDS Anil Chauhan: త్రివిధ దళాధిపతి, సీడీఎస్ అనిల్ చౌహాన్ 1962 ఇండియా-చైనా యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో భారత వైమానిక దళాన్ని ఉపయోగించి ఉంటే కథ వేరుగా ఉండేదని అన్నారు. వైమానిక దళం ఉపయోగించడం వల్ల చైనా దాడి తగ్గేదని చెప్పారు. వైమానిక దళాన్ని ఉపయోగించడం ఉద్రిక్తతల్ని పెంచడం అవుతుందని కొందరు భావిస్తారు, కానీ ఆపరేషన్ సిందూర్ సమయంలో అలా జరగలేదని నిరూపితం అయిందని అనిల్ చౌహాన్ బుధవారం అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారు. దీంతో అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 25 బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని తెలిసింది. పూర్త వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. అనేక ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం తనీఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ తనిఖీలు…
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా తాను నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు.
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా…
ఆపరేషన్ సిందూర్-2, 3 భాగాలు అనేది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. మొరాకోలోని భారతీయ సమాజంతో జరిగిన సంభాషణలో రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.