Home
Operation Sindoor
Operation Sindoor News
-
India Pakistan: సరిహద్దు దాటేందుకు పాక్ జాతీయుడి యత్నం.. కాల్చి చంపిన బీఎస్ఎఫ్.
India Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం పంజాబ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) దాటేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గురువారం బీఎస్ఎఫ్ హతమార్చింది. -
Baglihar Dam: చీనాబ్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసిన భారత్.. పాకిస్తాన్లో భయం భయం..
Baglihar Dam: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయాలో పాటు శిక్షణా శిబిరాలు ధ్వంసం అయ్యాయి. దాదాపుగా 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. -
MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..
MP Priti Patel: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత చర్యని పలు దేశాలు సమర్థిస్తున్నాయి. -
Operation Sindoor: ‘‘ఎవరైనా భారత్ వ్యతిరేక ప్రచారం చేశారో..’’ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. Read Also: Operation Sindoor Live Updates: పాక్‌కి వెన్నులో వణుకు… -
Operation Sindoor: సరిహద్దులు మూసివేత, సిద్ధంగా మిస్సైల్స్, ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్స్.. బోర్డర్లో హై అలర్ట్..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 09 ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను క్షిపణులతో భారత్ నాశనం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది భారత్‌పై ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో భారత్ హై అలర్ట్ అయింది. ముఖ్యంగా, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. -
Operation Sindoor: ఫ్రారంభమైన అఖిలపక్ష సమావేశం
Operation Sindoor: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన గత అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు నిన్ననే సమావేశమై ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్… -
Operations Sindoor : పాక్ పరువు పోయింది.. మేం ఏం చేయలేం అంటూ వీడియోలు
Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్‌లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్‌ను వారు ప్రయోగించినా,… -
India vs Pak : పాక్ కాల్పులు.. ఇండియన్ ఆర్మీ జవాన్ మృతి
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.… -
CM Revanth Reddy : భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ
CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. రక్షణమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. HYD: భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ర్యాలీ. సాయంత్రి 6 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. అమరావతి రీ-లాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాల కేటాయింపుపై చర్చ. సీఎం చంద్రబాబు అధ్యక్షత ఉదయం 11…
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!