Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్‌లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.
Read Also: Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
దీనికి ఒక రోజు ముందు భారత రక్షణ కోసం ఏ సరిహద్దునైనా దాటవచ్చు అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పొరుగుదేశం తన గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం పాకిస్తాన్‌కు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎఫ్-16, జేఎఫ్ విమానాలను కూల్చామని వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం అన్నారు.
భారత రాజకీయ నాయకులు, ఆర్మీ చేస్తున్న ప్రకటనల్ని చూశామని, తీవ్ర ఆందోళనకరమైనవిగా గుర్తించామని భవిష్యత్తులో జరిగే సంఘర్షణ వినాశనానికి దారితీయవచ్చని, ఒకవేళ కొత్త యుద్ధం తలెత్తితే పాకిస్తాన్ వెనక్కి తగ్గదని, ఎటువంటి సంకోచం, సంయమనం లేకుండా మేము దృఢంగా స్పందిస్తామని ఆ దేశం చెప్పింది. పాకిస్తాన్ విధ్వంసకరంగా స్పందిస్తుందని ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ భారత్‌లోని ప్రతీ మూలకు చేరుకుంటుందని ప్రగల్భాలు పలికింది. పాకిస్తాన్‌ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని చెప్పడం, మీకు కుడా అదే వర్తిస్తుందని చెప్పింది.