IAF: భారతదేశం జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన వందలాది ఉగ్రవాదులు హతం అవ్వడంతో పాటు, భారత వైమానిక దాడిలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలు 10 వరకు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. తాము భారత్‌కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చామని పాకిస్తాన్ తన ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా ఈ వాదనల్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు.
Read Also: జుట్టు రాలిపోతోందా ? రాలడాన్ని ఆపే అద్భుత మార్గాలు ఇవే..
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ ఘన విజయం తర్వాత, తాజాగా పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ ఎయిర్ ఫోర్స్(IAF) దారుణంగా ట్రోల్ చేస్తోంది. పాకిస్తాన్‌కు ఉన్న కాసింత పరువును తీసేస్తోంది. భారత వైమానిక దినోత్సవం సందర్భంగా విందు మెనూలో పేర్లు చూస్తే పాకిస్తాన్ సిగ్గుపడటం ఖాయం. ఆ రేంజ్‌లో ఐఏఎఫ్ రోస్ట్ చేసింది. మెనూలో ‘‘ రావల్పిండి చికెన్ టిక్కా’’, ‘‘భోలారి పన్నీర్ మేథి మలై’’, ‘‘బాలకోట్ తిరమిసు’’, ‘‘బహవల్పూర్ నాన్’’, ‘‘రఫికీ మటన్’’, ‘‘సుక్కూర్ శామ్ సవేరా కోఫ్తా’’, ‘‘సర్గోదా దాల్ మఖ్నీ’’, ‘‘జకోబాబాద్ మేవా పులావ్’’ వంటి వంటకాలు ఉన్నాయి. ఇవన్ని పాకిస్తాన్ వైమానిక స్థావరాలను సూచిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్ రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. భోలారీ, స్కర్దు, రఫికీ, సుక్కూర్ లోని పలు పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని భారత్ నాశనం చేసింది. ఇక మురిడ్కే, బహవల్పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని, పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తూ ఐఏఎఫ్ మెనూను సిద్ధం చేసింది. 93వ భారత వైమానిక దళ దినోత్సవం తర్వాత అనేక మంది ఆర్మీ వెటరన్స్, జర్నలిస్టులు ఎక్స్‌లో ఈ మెనూను షేర్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది.