Russia: ఇటీవల కాలంలో రష్యా, పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఇంజన్లు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో కాంగ్రెస్, ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ప్రధాని మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపిస్తోంది. అయితే, వీటన్నింటిపై రష్యా క్లారిటీ ఇచ్చింది. ఫైటర్ జెట్‌లకు ఇంజన్లు ఇస్తున్నామనే ప్రచారాన్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ F-17 థండర్ బ్లాక్ III ఫైటర్ జెట్‌లకు RD-93MA ఇంజిన్‌లను అందిస్తున్నామనే దానిపై నిర్థారణ లేదని శనివారం చెప్పింది. ఈ నివేదికల్ని రష్యా తోసిపుచ్చింది. పాకిస్తాన్‌కు అంత స్థాయి సహకారం, భారతదేశానికి అసౌకర్యాన్ని కలిగిస్తుందని రష్యా పేర్కొంది.
Read Also: Physical Harassment: ఒంటరి మహిళను లైంగికంగా వేధించిన సీఐ.. కేసులో బిగ్ ట్విస్ట్!
చైనాలో తయారు చేసిన JF-17 ఫైటర్ జెట్ల ఇంజిన్లను సరఫరా చేయడం ద్వారా రష్యా పాకిస్తాన్‌కు సైనిక మద్దతును అందించనుందని మీడియా నివేదికలపై కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీ దౌత్యం జాతీయ ప్రయోజనాల కంటే ఇమేజ్-బిల్డింగ్, ప్రపంచ దృశ్యాన్ని ఆకర్షించేందుకే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం రష్యా నుంచి క్లారిటీ రావడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.