Anil Chauhan: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెపోటిజం(బంధుప్రీతి) లేని ఏకైక ప్రదేశం సైన్యం మాత్రమే అని చెప్పారు. దేశానికి సేవ చేయడానికి, వివిధ ప్రాంతాలను అన్వేషించడానికి సాయుధ దళాల్లో చేరాలని పిల్లలను కోరారు. రాంచీలోని పాఠశాల పిల్లలతో మాట్లాడిన ఆయన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల్ని కాపాడేందుకు సాయుధ దళాలు ఈ ఏడాది చాలా ప్రయత్నాలు చేశాయని చెప్పారు.
Read Also: Coffee: కాఫీ ప్రియులకు అలర్ట్.. మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా?
“బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘ఫౌజ్’ (సైన్యం)… మీరు దేశానికి సేవ చేయాలనుకుంటే, దేశాన్ని, ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే మీరు సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షించాలి” అని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి మే 7 తెల్లవారుజామున 1 గంటలకు మొదటి దాడి నిర్వహించినట్లు ఆయన చెప్పారు. రాత్రిపూట సుదూర ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడులకు ప్రత్యేక ప్రయత్నాలు అవసరం అని అన్నారు.