Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ శాఖ చీఫ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ‘‘ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని శుక్రవారం చెప్పారు. దేశ సైనిక సంసిద్ధత హై అలర్ట్‌లో ఉందని, 24 గంటలూ, ఏడాది పొడవునా ఉంటుందని చెప్పారు.
Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్కు హైపర్సోనిక్ వెర్షన్.
Parliament Session: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది.
Drone squadrons: భారత్-పాకిస్తాన్ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీ్ర్యం చేసేందుకు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’ను మోహరిస్తోంది. మే 7 నుంచి మే 10 మధ్య పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.
MiG-21: భారత వైమానిక దళం(IAF)లో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 రిటైర్ కాబోతోంది. చివరి జెట్‌ను సెప్టెంబర్ 19న చండీగఢ్ వైమానిక స్థావరంలోని 23 స్క్వాడ్రన్ (పాంథర్స్) నుంచి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 1963లో వైమానిక దళంలో చేరిన మిగ్-21, 1965, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్‌లలో కీలక పాత్ర పోషించింది.
పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల చర్యతో యావత్ భారత్ పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని నినదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బతీసింది. ఇదిలా ఉంటే.. ఓ పదేళ్ల బాలుడు ఆపరేషన్ సింధూర్ హీరో అయ్యాడు. శ్రవణ్ సింగ్ అనే బాలుడికి భారత ఆర్మీ బంపరాఫర్ ఇచ్చింది. తారావాలి గ్రామంలో నివసించే శ్రవణ్, ఆపరేషన్…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజే హాట్‌హాట్‌గా సమావేశాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సిందూర్, బీహార్ ఎన్నికల ప్రక్రియ, పలు అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని డిమాండ్ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.
Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.
Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్‌కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..