Parliament attack: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సీనియర్ ఉగ్రవాది మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌లో ఓ మతపరమైన కార్యక్రమంలో తన బాస్, జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ చేసిన ఉగ్రవాద దాడుల గురించి చెబుతూ, అతడిపై ప్రశంసలు కురిపించారు. ఇదే కాకుండా, ఉగ్రవాదానికి పాకిస్తాన్‌తో సంబంధం ఉందని అంగీకరించాడు. తాజాగా, ముంబై దాడులు, భారత పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడుల్లో అజార్ ప్రమేయం ఉందని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని బట్టి చూస్తే, ఈ ఉగ్రవాద కార్యకలాపాలు పాకిస్తాన్ తో లింక్ అవుతున్నాయి.
Read Also: Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా నుండి లోకేష్ కనకరాజ్ అవుట్..
కాందహార్ విమానం హైజాక్ ఘటన సమయంలో అజార్‌ను తీహార్ జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ ఉగ్రవాది బాలాకోట్ స్థావరంగా ఉగ్రవాదానికి పాల్పడినట్లు కాశ్మీరీ వెల్లడించారు. 2019లో భారత ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు కూడా కాశ్మీరీ ఒప్పుకున్నాడు. మే 7న భారత సైన్యం జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో బహవల్పూర్ జైషే కార్యాలయంపై దాడి జరిగిందని, అజార్ కుటుంబం ఈ దాడిలో హతమైనట్లు చెప్పాడు.
ఇదే కాకుండా పాక్ ఆర్మీ జనరల్స్ స్వయంగా ఉగ్రవాదులు అంత్యక్రియలకు హాజరయ్యారని, ఇది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలతో జరిగిందని కాశ్మీరి చెప్పారు. మసూద్ అజార్‌ను కీర్తిస్తూ, అతడిని ఉగ్రవాదాన్ని ఒసామా బిన్ లాడెన్ ‘‘అమరవీరుడు’’ అంటూ కొనియాడాడు. గత కొంత కాలంగా తమ నేల పై నుంచి ఉగ్రవాదం కొనసాగడం లేదని చెబుతున్న పాకిస్తాన్‌కు ఇది మింగుడు పడని పరిణామం. స్వయంగా జైషే ఉగ్రవాద నేత, పాకిస్తాన్ ప్రమేయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు.