Operation Sindoor: ‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..
- మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది..
- ఆపరేషన్ సిందూర్‌పై జైషే మహ్మద్ టాప్ కమాండర్..
- బలవల్పూర్ దాడిలో 10 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్‌లో అమాయకులైన 26 మందిని చంపి, వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ధీటుగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇదిలా ఉంటే, భారత సైన్యం పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవల్పూర్ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్‌పై మే 7న రాత్రి సమయంలో భీకరమైన దాడి చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం హతమైంది. ఈ విషయాన్ని తొలిసారిగా ఆ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒప్పుకున్నారు. బహవల్పూర్ జామియా మసీదు సుభాన్ అల్లాహ్ అనే జైషే ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో అజార్ కుటుంబం ‘‘ముక్కులు ముక్కులు అయింది’’ అని కాశ్మీరీ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
Read Also: CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించింది. పాకిస్తాన్ లోపల, సరిహద్దు నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని బహవల్పూర్ జైషే కార్యాలయంపై భారత వైమానిక దళం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మొత్తంగా, పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్‌కు కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఇందులో అతడి సోదరి, ఆమె భర్త, అతడి మేనల్లుడు, మేన కోడలు, అతడి కుటుంబంలోని పిల్లలు ఉన్నారు. ఈ దాడిలో అజర్ సహాయకులు నలుగురు మరణించారు.
అయితే, దాడికి సంబంధించిన వివరాలను పాకిస్తాన్ ఎప్పుడూ అంగీకరించలేకపోయినా, ఉగ్రవాదులు తమకు జరిగిన నష్టాలను ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది అజార్, భారత్ లో జరిగిన 2016 పఠాన్ కోట్, దాడికి 2019లో 44 మంది సైనికుల్ని బలిగొన్న పుల్వామా దాడికి ప్రధాన కారకుడు. చివరిసారిగా మసూద్ అజార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కనిపించాడు.
🚨 #Exclusive 🇵🇰👺
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!