Union Budget 2026: దేశ రక్షణకు భారీగా నిధులు.. పెరిగిన డిఫెన్స్ బడ్జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: దేశ రక్షణకు 2026 కేంద్ర బడ్జెట్‌లో నిధులను పెంచారు.రక్షణ మంత్రిత్వ శాఖ 2026-27కు సంబంధించి రూ. 7.8 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 15 శాతం ఎక్కువ. ఈ బడ్జెట్‌లో భారత సైన్యం ఆధునీకీకరణ కోసం రూ. 2.19 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 21.84 శాతం పెరుగుదల. సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లు, సీమాంతర ఉగ్రవాదం, పాకిస్తాన్, చైనాలతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచారు.
బడ్జెట్‌లో ముఖ్యమైన కేటాయింపులను పరిశీలిస్తే.. విమానాలు, ఏరో ఇంజన్ల కోసం రూ. 63,733 కోట్లను కేటాయించారు. రక్షణ సేవల రెవెన్యూ ఖర్చులు అంటే రోజూవారీ నిర్వహణ, ఇంధనం, మందుగుండు సామాగ్రి, మరమ్మతులు, సహాయక సిబ్బంది జీతాలు మొదలైన వాటికి 17.24 శాతం నిధుల్ని పెంచారు. పెన్షన్ల కోసం గతేడాదితో నిధులతో పోలిస్తే 6.53 శాతం పెంచి, రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ మూలధన వ్యయంలో 28% పెరుగుదల రూ. 2.31 లక్షల కోట్లకు చేరుకోవడం కీలకమైన అంశం. ఇది అధునాతన ఆయుధ వ్యవస్థలను సంపాదించడానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇది దేశీయ రక్షణ తయారీని వేగవంతం చేయడానికి మద్దతునిస్తుంది.
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
Read Also: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
రక్షణ బడ్జెట్ మొత్తం జీడీపీలో 11 శాతం ఉంది. ఇది 2025-26లో 8 శాతం మాత్రమే. రక్షణ రంగానికి చెందిన యూనిట్లు విమానాల భాగాల తయారీ కోసం దిగుమతి చేసుకునే ముడిపదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఈ భాగాలు ముఖ్యంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ అవసరాల కోసం ఉపయోగించబడుతాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగానికి కేటాయించే నిధులు పెంచాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్‌కు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ తమ నిధులను కనీసం 20 శాతం పెంపును కోరినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, గత 26 ఏళ్లలో భారత రక్షణ వ్యయం ఏకంగా 40 శాతం కన్నా ఎక్కువ పెరిగింది. ఇందులో రక్షణ మూలధన వ్యయం ఎక్కువగా ఉంది.
Defence Ministry allocated a budget of Rs 7.8 lakh crore for the year 2026-27. Defence forces to get Rs 2.19 lakh crore for modernisation.
The Defence Ministry has major projects in the pipeline, like the contracts for Rafale fighter jets, submarines and unmanned aerial… pic.twitter.com/dT5pn1cpsr
— ANI (@ANI) February 1, 2026
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..