Su-57 fighter Jet: రష్యా Su-57 ఫైటర్ జెట్ కొనుగోలుకు భారత్ ఆసక్తి..
- రష్యన్ Su-57 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆసక్తి..
- భవిష్యత్ ఘర్షణల్లో 5వ తరం యుద్ధ విమానాలు కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Su-57 fighter Jet: ఆపరేషన్ సిందూర్ తర్వాత మన ‘‘ఎయిర్ పవర్’’ ఏంటో పాకిస్తాన్‌కు అర్థమైంది. భవిష్యత్ సంఘర్షణల్లో ఎయిర్‌ఫోర్స్ కీలకమనేది స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారత్ తన వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. శత్రువులతో యుద్ధం మాత్రమే కాకుండా, శత్రు రాడార్లకు దొరకకుండా దాడి చేసే ‘‘5వ తరం యుద్ధ విమానాల’’ కొనుగోలుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రష్యా తయారీ సుఖోయ్ సు -57ను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళంలో రాఫెల్ 4.5 జనరేషన్ యుద్ధ విమానాలుగా భావిస్తున్నారు. 5వ తరం యుద్ధ విమానాలు మన దగ్గర లేవు. దీంతో 40 జెట్లను ఆర్డర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
యుద్ధ సామర్థ్యాలే కాకుండా, స్టెల్త్ సామర్థ్యాన్ని సు -57ను కలిగి ఉంది. ఐదోతరం యుద్ధ విమానాల్లో ఇంటిగ్రేటెడ్ ఏవియానికస్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇందులో ఆటోమేషన్ ఉంటుంది, పోరాట సమయంలో పైలట్ నిర్ణయాలను త్వరితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. భూమిపై ఉన్న కంట్రోల్ సిస్టమ్స్, ఇతర విమానాలతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటతుంది. ఇది ఆకాశంలో ఎదురుదాడి చేయడమే కాకుండా, భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేస్తుంది.
ప్రస్తుతం చైనా, రష్యా, అమెరికా వద్ద 5వ తరం జెట్ విమానాలు ఉన్నాయి. చైనా వద్ద జే-20 (J-20) స్టెల్త్ విమానాలు ఉన్నాయి. వీటిని పాకిస్తాన్ కూడా కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వద్ద కూడా 5వ తరం యుద్ధ విమానాల తప్పనిసరి ఏర్పడింది. ప్రస్తుతం భారత్ సొంతగా AMCA (Advanced Medium Combat Aircraft) అనే 5వ తరం విమానాన్ని తయారు చేస్తోంది. ఇది 2035 నాటికి గానీ సైన్యంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ లోపే ఏర్పడే ఖాళీని రష్యన్ సు-57తో పూడ్చాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..