India-Pakistan war: భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్‌ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్‌కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు.
Asif Ali Zardari: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు…
Pakistan: పాకిస్తాన్‌కు చైనా తన నాలుగో తరం యుద్ధవిమానమైన J-10Cని ఇస్తోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, చైనా గత ఐదేళ్లలో 20 యుద్ధవిమానాలను సరఫరా చేసిందని, ఇప్పుడు మరో 16 J-10 ఫైటర్ జెట్లను ఇవ్వబోతున్నట్లు పెంటగాన్ తాజా నివేదిక వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో చైనా స్థావరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని పేర్కొంది. J-10C సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ కాగా, J-10S డబుల్ సీటర్,…
Droupadi Murmu: 10 ఏళ్ల బాలుడు శ్రవణ్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’’ దక్కింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధభూమిలో ఉన్న మన జవాన్లకు నీరు, పాలు, లస్సీ అందిస్తూ తన దేశభక్తిని చాటుకున్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాక్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి క్రమం తప్పకుండా సేవ చేశాడు. శ్రవణ్ సింగ్ కనబరిచిన దేశభక్తికి రాష్ట్రపతి నుంచి శుక్రవారం ఈ పురస్కారం…
Op Sindoor 2.0: పాకిస్తాన్‌ను ‘‘ ఆపరేషన్ సిందూర్ ’’ దాడులు భయపెడుతూనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ తీవ్రస్థాయిలో దాయాదిపై విరుచుకుపడింది. ఆనాటి దాడులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ భయపడేలా చేస్తున్నాయి. తాజాగా, ఆపరేషన్ సిందూర్ 2.0 దాడులు జరుగుతాయనే భయంతో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(LOC) వెంబడి ఆయుధాలను మోహరిస్తోంది. ఎల్ఓసీ, పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే) ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ మోహరింపుల్ని గణనీయంగా పెంచింది. కౌంటర్ అన్ మ్యాన్డ్ ఎరియల్…
Pakistan: పాకిస్తాన్ రాజకీయ నేత, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు, సీనియర్ రాజకీయ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్, మునీర్ అరాచకాలపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సంఘటనను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దైవిక సహాయం పొందినట్లుగా తెలిపాడు.
Operation Sindoor: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పూణేలో మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ పూర్తి ఓటమిని చవిచూసిందని అన్నారు. 7
Asim Munir: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పాకిస్తాన్, దాని మిలిటరీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు బుద్ధి రావడం లేదు. మరోసారి మునీర్ భారత్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే పాకిస్తాన్ వేగంగా, తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ‘‘ఏదైనా దురాక్రమణ జరిగితే పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుంది. భారత్ ఎలాంటి భ్రమల్లో ఉండకూడదు’’ అని గత వారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్) పదవిని స్వీకరించిన…