నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,…
నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వకారణం అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయని అన్నారు. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు,క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రోత్సహిస్తున్నది చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనమని..నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్ కు వ్యక్తిగతంగా…
జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక చోట బస్సు, బైక్, ఆటో, ట్రాక్టర్ లతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. దీంతో.. అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బస్సు .. ఒకరికి ఢీ కొట్టడంతో ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి…
నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివతండాలో బ్లేడ్ దాడి కలకలం రేపింది. 10వ తరగతి విద్యార్థి పై 9వ తరగతి బాలుడు బ్లేడ్ తో దాడి చేసాడు. దీంతో 10వ తరగతి విద్యార్థికి మెడపై మరో రెండు చోట్ల గాయాలయ్యాయి. నవిపేట ఆదర్శ పాఠశాలలో ఈఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివ తండాలో నివాసం ఉంటున్న విద్యార్థులు.. రోజులాగానే నవిపేట ఆదర్శ పాట శాలకు బయలు దేరారు. పాఠశాలకు వెళ్ళిన…
నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో…
నిజామాబాద్ GGH ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్స్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పద మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి వరకు డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ సూపరిండెంట్ మీడియాను లోపాలకి అనుమతించకపోవడంతో.. పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. మరో నెల…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కెఆర్ నాగరాజు వివరాలు వెల్లడించారు. కొందరు సమాచారం ఇవ్వడంతో.. టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల అధ్వర్యంలో లైన్ గల్లీలో దాడులు నిర్వహించామని తెలిపారు. నిర్వాహకులు మహమ్మద్ అబుబకర్, షేక్ నేహల్ ఇద్దరి కిరాణషాప్, గోదాంలలో నిషేధిత గుట్కా జర్దాను సీజ్ చేసినట్లు…
సూటిగా సుత్తి లేకుండా కామెంట్ చేసేశారు TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూడేళ్ల గ్యాప్ తర్వాత పదునైన విమర్శలతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై విరుచుకుపడ్డారు. ఇందూరులో పసుపు రాజకీయాన్ని వేడెక్కించడంతోపాటు.. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు నిజామాబాద్లో పొలిటికల్ గేర్ మార్చినట్టు చెప్పకనే చెప్పేశారు కవిత. 2019 ఎన్నికల తర్వాత అనేక పర్యాయాలు కవిత నిజామాబాద్లో పర్యటించినా.. ఎంపీ అరవింద్పై ఈ స్థాయిలో విరుచుకుపడింది లేదు. ఈ మాటల తూటాలు చూశాక రాజకీయ వర్గాల్లో…
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు. రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు…