ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండలంలో నివాసముంటున్న మహేందర్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు బాగానే వున్న నిన్న ఎలక్రిక్ బైక్ కు చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ అవుతున్న బైక్ కు గంట తరువాత అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారుడు, స్థానికులు అప్పమత్తమై పరుగులు పెట్టారు. దీంతో ప్రాణాప్రాయం తప్పడంతో ఊపిరి పీల్చకున్నారు. కొన్ని ఏడాదికే కాలిపోయిందని బైక్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ రేటు భరించలేక ఈ ఎలక్రిక్ బైక్ కొన్నానని కానీ.. అదికూడా కాలిబూడిదైందని బాదితుడు మహేందర్ వాపోయాడు.
కొద్ది రోజుల క్రితం నిర్మల్ జిల్లా భైంసాలో పార్కింగ్ చేసివున్న ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగి, కాలిబూడిదైన ఘటన , మరొక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన ఘటనలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలు మరవకముందే నిర్మల్ జిల్లాలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ కాలిన ఘటన ప్రయాణికులకు భయాందోళనకు గురిచేస్తోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్న తరుణంలో పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుకు గతంలో ఆసక్తి చూపిన వారు మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. పెట్రోల్ మంటకు భయపడేవారికి ఎలక్రిక్ బైక్ లో.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వాహనదారులు బెంబెలెత్తుతున్నాడు.