నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా అమాయకులకు వలవేసి.. ఆశ పెట్టి మోసం చేస్తున్నారు. బాన్సువాడకు చెందిన ఎజాజ్ అహ్మద్ కు కరెన్సీ కేటుగాళ్ల నుంచి వింత అనుభవం ఎదురైంది. తాడ్పోల్ చౌరస్తాలో ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర మరో స్నేహితుడితో కలిసి కూర్చున్న ఎజాజ్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ముత్తూట్ ఫైనాన్స్ ఎక్కడ అని అడిగాడు వచ్చిన కేటుగాడు. తన పేరు శివకుమార్ గా పరిచయం చేసుకున్నాడు. తనకు అర్జంటుగా ఇండియన్ కరెన్సీ అవసరముందని తన దగ్గర దుబాయ్ దీరమ్స్ ఉన్నాయన్నాడు.
మార్కెట్ లో అయితే వంద దీరమ్స్ కి 900 రూపాయలు వస్తాయని ఆశ చూపాడు. తనకు అర్జంటుగా డబ్బు అవవసరం ఉందని ఐదొందలిస్తే వంద దీరమ్ కరెన్సీ ఇచ్చేస్తానన్నాడు. ఆశపడ్డ ఎజాజ్ వెయ్యి రూపాయలిచ్చి.. వందవి రెండు దీరమ్ కరెన్సీలను తీసుకున్నాడు. అనుమానంతో వెంటనే వెళ్లి మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్ లో మార్పిస్తే… శివకుమార్ పేరుతో వచ్చిన కేటుగాడు చెప్పినట్టుగానే… 1900 చొప్పున ఇండియన్ కరెన్సీ దక్కింది. వెయ్యి రూపాయలకు… 2800 రూపాయలదనంగా రావడంతో సంతోషపడ్డాడు ఎజాజ్. కానీ ఇక్కడే గోల్ మాల్ మొదలైంది.
బాన్సువాడలో ఏజాజ్ ఘటన మరువకముందే.. బోధన్ లోనూ ఇదే తరహా మోసం వెలుగు చూసింది. దుబాయ్ దినార్ పేరిట ఘరానా మోసం చేశారు.. కరెన్సీ కేటుగాళ్లు. లక్ష రూపాయల విలువ చేసే దుబాయ్ కరెన్సీ తీసుకుని 50 వేలు ఇండియన్ కరెన్సీ ఇస్తే చాలంటూ.. ఓ యువకునికి కేటుగాళ్లు గాలం వేశారు. వాళ్లు ఇచ్చేవి అసలైన కరెన్సీ అంటూ నమ్మించారు. రెండున్నర లక్షలు ఇండియన్ కరెన్సీ తెచ్చి ఐదులక్షల విలువ చేసే దుబాయ్ కరెన్సీ తీసుకున్నాడు. ఐతే ఇంటికెళ్లి బ్యాగ్ చూసే సరికి షాక్ తిన్నాడు సదరు బాధితుడు. నోట్ల కట్ట పైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టి.. మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి ఘరానా మోసం చేశారు. కరెన్సీ కేటుగాళ్లు.
అత్యాశకు పోయి మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బోధన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. దుబాయ్ దీరమ్స్ పేరిట వచ్చే కేటుగాళ్లను నమ్మవద్దంటూ సూచిస్తున్నారు బోధన్ పోలీసులు. ఆన్ లైన్ మోసాలు చూశాం.. సైబర్ మోసాలను విన్నాం.. కానీ కొందరు కేటుగాళ్లు దుబాయ్ దినార్ పేరిట నయా దందాకు తెరలేపి మోసాలకు పాల్పడుతుండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. ఇలాంటి కరెన్సీ కేటుగాళ్ల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. ఈజీ మనీకి అలవాటుపడితే అసలు మనీకే ఎసరు అని గుర్తించాలి.
YCP : పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేయాలట..!