కేవలం హోం వర్క్ చేయలేదనే ఒకేఒక్క కారణంతో టీచర్ వేసిన శిక్షకు ఆచిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా లోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో చోటుచేసుకున్న ఈఘటన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అర్సపల్లికి చెందిన ఫాతిమాకు 7ఏండ్లు. ఫాతిమా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో రెండోతరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోంవర్క్ చేయలేదని టీచర్ కోప్పడింది. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై…
నిజామాబాద్లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. నిషేధిత సిమీ అనుబంధ సంస్థ 'పీఎఫ్ఐ' కరాటే ట్రైనింగ్ పేరుతో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ట్రైనింగ్ పేరిట పీఎఫ్ఐ మత ఘర్షణల కుట్రకు తెరలేపిందని పోలీసులు నిర్ధారించారు. 28 మంది నిందితులను గుర్తించి నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అసలే వారిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. ఛాన్స్ దొరకగానే పరస్పరం మాటలతో విరుచుకు పడుతున్నారు. పార్టీ ఇంఛార్జ్ ఎదుటే అలా జరగడంతో అంతా బిత్తర పోయారట. నాకెందుకు చెప్పలేదని ఒకరు.. నీకెందుకు చెప్పాలని ఇంకొకరు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట. ఈ తాజా గొడవపైనే కాంగ్రెస్లో చర్చ. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఇద్దరూ కీలక నాయకులే.…
నిజామాబాద్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. మెండోరాలో రికార్డ్ స్థాయిలో 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదో రోజు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 10 వేల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు.. కప్పుల వాగు కారణంగా భీంగల్- సిరికొండ మధ్య,…
నిజామాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయని, ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వమించిన బీజేపీ అధ్యక్షన కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో గంజాయి కూడా విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ వైఫల్యం చెందారని ఆరోపించారు. జిల్లాలో ప్రజాప్రతినిదులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని.. ఎంపీగా ఉన్న తనపై కూడా హత్యాయత్నం జరిగిందన్నారు. స్వయంగా తానే ఫిర్యాదు…
నిజామాబాద్లో వెలుగు చూసిన ఉగ్రవాదం లింకులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కరాటే, లీగల్ అవేర్నెస్ ముసుగులో తెలుగు రాష్ట్రాల యువకులు ఓ వ్యక్తి భౌతిక దాడులు, మతపరమైన సంఘర్షణలు సృష్టించే కార్యకలాపాలకి శిక్షణ ఇస్తున్న వ్యక్తిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లాతో పాటు…