జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక చోట బస్సు, బైక్, ఆటో, ట్రాక్టర్ లతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. దీంతో.. అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
బస్సు .. ఒకరికి ఢీ కొట్టడంతో ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఢీ కొట్టడంతో షేక్ లతీఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ లతీఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులను బోధన్ బంధువుల దగ్గర దింపేందుకు బస్ ఎక్కేందుకు వెళ్తుండగా..బస్టాండులో కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతి చెందిన షేక్ లతీఫ్ వయస్సు సుమారు 50 సంవత్సరాలు వుంటుందని గుర్తించారు. స్థానిక సమాచారంతో కామారెడ్డి టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తన కళ్ళముందు వుండే షేక్ లతీఫ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాధఛాయలు అలుముకున్నాయి.
ఇక నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం స్టేజీ వద్ద ఆటో ను డీ.సి.ఎం వాహనం ఢీకొట్టింది. ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ఒక్కసారిగా హైవే పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు అధికారులు.
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Priyanka Chopra: ముఖంపై ఆ రక్తపు మరకలేంటి?