నిజామాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వమించిన బీజేపీ అధ్యక్షన కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో గంజాయి కూడా విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ వైఫల్యం చెందారని ఆరోపించారు. జిల్లాలో ప్రజాప్రతినిదులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని.. ఎంపీగా ఉన్న తనపై కూడా హత్యాయత్నం జరిగిందన్నారు. స్వయంగా తానే ఫిర్యాదు…
నిజామాబాద్‌లో వెలుగు చూసిన ఉగ్రవాదం లింకులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో తెలుగు రాష్ట్రాల యువకులు ఓ వ్యక్తి భౌతిక దాడులు, మతపరమైన సంఘర్షణలు సృష్టించే కార్యకలాపాలకి శిక్షణ ఇస్తున్న వ్యక్తిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లాతో పాటు…
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై లారీ ఆగివుంది. జగిత్యాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఆర్మూర్ వైలుతున్న ఆల్టో కారు ఢీ కొట్టంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారులో వున్న ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నవారు కాపాడండి అంటూ కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.…
తాగడానికి మంచి నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందినశనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ కుమార్ అనే వ్యక్తి దుస్తుల కొనేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. అయితే నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళి దుస్తులు కొనుగోలు చేశారు. కాసేపు ఆ షాపింగ్ మాల్ లో తిరిగిన అనంతరం దాహం వేయడంతో విజయ్ కుమార్ సిబ్బందిని…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు తమకు గుర్తింపు లేదని తరచూ నిరసన గళం ఎత్తుతారు. ఒకవేళ గుర్తించి పదవులు ఇస్తే మరోలా స్పందిస్తారు. పార్టీలో కీలక పదవులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకే ఇచ్చారని.. ఇతర జిల్లాల వారిని పక్కన పెట్టారని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ.. కోశాధికారి సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. వీళ్లంతా నిజామాబాద్ జిల్లా నాయకులే. మహేష్‌గౌడ్ పూర్తిస్థాయిలో పార్టీ పనిలో ఉంటే..…
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు.…
నిజామాబాద్ జిల్లా పర్యటనకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయనను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరా తీయగా, జిల్లాలో కేంద్ర పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ముద్ర రుణాల పంపిణీలో నిజామాబాద్…
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాలు.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య పోటీకి దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నేతలు పోటీపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బోధన్‌తోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రేస్ మరీ ఎక్కువగా ఉందట. బోధన్ నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెడీ అవుతున్నారు. ఈ మధ్య అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా.…
ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండలంలో నివాసముంటున్న మహేందర్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు బాగానే…