దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు.…
కోవిడ్, ఫీవర్ సర్వే, దళిత బంధు పై నిజామాబాద్ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోవిడ్ ఆంక్షలు, ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీవర్ సర్వేను చేపట్టిందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. సమగ్ర వివరాలు లేకుండా మీటింగ్కు ఎందుకు వచ్చారని అధికారులపై అసహనం…
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా కవితతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైనా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇంకా మరో పదిమంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. Read Also: ఇండియా టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్ కవితతో పాటు స్థానిక…
నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సురేష్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కరిపే గణేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ప్రతిష్ఠకు భంగం కల్గిస్తూ.. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. Read Also: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శించిన సీపీ కరిపె గణేష్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్టు…
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బాబాపూర్కు చెందిన సరస్వతి 317 జీవో మూలంగా స్వంత ఊరు నుంచి కామారెడ్డికి ట్రాన్సఫర్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఎం ధర్మారావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విట్టల్, నిజామాబాద్ జిల్లా…
నిజామాబాద్ జాతీయ రహదారి పై కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నోట్లని తుక్కు గా మార్చి తగలబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నోట్లు భారీగానే వున్నట్టుగా చెబుతున్నారు. జిల్లాలోని బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే కనపడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు. ఒక వాహనం నుండి సంచి పడిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై తగలబెట్టినవి దొంగ నోట్లా అసలు నోట్లా అనే దానిపై విచారణ జరుగుతోంది. జాతీయ…
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే లేకుండా ఎంపీ అరవింద్ ప్రారంభోత్సవం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గన్నరం గ్రామం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవాలకు వెళ్ళారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన రావడానికి ముందే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేశారు టీఆర్ఎస్ నేతలు. పసుపు…
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశనగ పరిశోధన కేంద్రం, కర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 20న సోమవారం జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. జనగామలో కూడా…
నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మాఫియా ఆటలు మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. రాత్రయితే చాలు ఇసుక అక్రమంగా రవాణా సాగుతోంది. ఈ ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు వీఆర్ఏ ను హత్య చేసింది ఇసుక మాఫియా. బోధన్ మండలం కండ్గావ్లో ఈ దారుణం జరిగింది. గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు వీఆర్ఏ గౌతమ్. ఇసుక మాఫియా దీనిని సహించలేదు. వీఆర్ఏను చితకబాదింది…