నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివతండాలో బ్లేడ్ దాడి కలకలం రేపింది. 10వ తరగతి విద్యార్థి పై 9వ తరగతి బాలుడు బ్లేడ్ తో దాడి చేసాడు. దీంతో 10వ తరగతి విద్యార్థికి మెడపై మరో రెండు చోట్ల గాయాలయ్యాయి. నవిపేట ఆదర్శ పాఠశాలలో ఈఘటన చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివ తండాలో నివాసం ఉంటున్న విద్యార్థులు.. రోజులాగానే నవిపేట ఆదర్శ పాట శాలకు బయలు దేరారు. పాఠశాలకు వెళ్ళిన 10 తరగతి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థికి మాట మాట పెరిగింది. దీంతో రెచ్చిపోయిన 9వ తరగతి విద్యార్థి తన వద్ద వున్న బ్లేడ్ తో 10వ తరగతి విద్యార్ధి పై దాడి చేశాడు. మెడపై మరో రెండు చోట్లు దాడి చేయడంతో.. 10వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలయ్యాయి. ఖంగుతిన్న తోటి విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి ఈవిషయం తెలుపడంతో.. అప్రమత్తమైన యాజమాన్యం హుటాహుటిన 10వ తరగతి విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
అయితే వీరిద్దరి మద్య గొడవ ఎందుకు తలత్తింది అనేది ఇంకా పూర్తీ వివరాలు తెలియరాలేదు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యం పై మండి పడుతున్నారు. పాఠశాలలో ఇదంతా జరుగుతున్నా యాజమాన్యం ఎక్కడికి పోయారని, వాళ్లకు తెలియకుండా ఇదంతా జరిగిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాన్నారు. చిన్న పిల్లలు దాడి వరకు వచ్చారంటే టీచర్లు ఏం చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికైనా యాజయం ఇటువంటి చర్యలు జరగకుండా పాఠశాలపై నిఘా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అయితే.. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో (3 Mar 2022)న దారుణ మైన ఘటన వెలుగుచూసింది. డిజిటల్ తరగతిలో అల్లరి చేస్తుండగా వారించినందుకు ఇద్దరు విద్యార్థులు క్లాస్‌మేట్‌ని దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్ సాయికృప పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఈ విషయాన్ని ఓ విద్యార్థి స్కూల్ ప్రిన్సిపల్ అంజనారావుకు చెప్పడంతో ఆమె మంజూర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో నిర్వాహకులు విద్యార్థులందరినీ ఇళ్లకు పంపేసి పాఠశాలను మూసివేశారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Undavalli Arun Kumar: సీఎం జగన్‌కు ఉండవల్లి లేఖ.. విషయం ఇదే..