ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఢిల్లీ పేలుడు కారణంగా మరోసారి పర్యటన వాయిదా పడింది.
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి.
Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్‌కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి.
Palestine President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక బాంబ్ పేల్చారు. ఇంతకీ ఏంటదని అనుకుంటున్నారా.. గాజా ఒప్పందం గురించి ప్రపంచానికి తెలుసుకదా.. ఇదే సమయంలో ట్రంప్ తదుపరి పాలస్తీనా అధ్యక్షుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇక్కడే ఆయన బాంబు పేల్చింది.. ఇంతకీ ఆ బాంబు ఎవరి కొంప ముంచిందని ఆలోచిస్తున్నారా.. మహమూద్ అబ్బాస్‌ది.. ఎందుకంటే తాజాగా ట్రంప్ జారీ చేసిన ముఖ్యమైన ప్రకటనలో మహమూద్ అబ్బాస్ స్వతంత్ర పాలస్తీనా అధ్యక్షుడు…
ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి.