దాదాపు రెండేళ్ల తర్వాత హమాస్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సోమవారం మూడు విడతలుగా బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
ట్రంప్ ప్రణాళికను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో గాజాలో శాంతికి పునాది పడినట్లైంది. అయితే తాజాగా హమాస్‌కు ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. తక్షణమే బందీలను విడుదల చేయాలని కోరింది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లారు. ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాల్లో శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి. అయితే ఈ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని ట్రంప్ ప్రకటించారు. తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని ఆయా దేశ ప్రధానులు వీడియోలు ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరోజు ముందే.. మంగళవారమే మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.