గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి. మరోసారి హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ దళాలపై దాడులకు తెగబడిందన్న ఆరోపణలతో ప్రధాని నెతన్యాహు శక్తివంతమైన దాడులకు ఆదేశించారు. దీంతో గాజాపై ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేయడంతో 30 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆ ఏరియాల్లో జాగ్రత్త..!
తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడి తర్వాత పొగలు ఎగిసిపడ్డాయి. గాజాలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఫోర్స్‌గా పనిచేస్తున్న ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు.
అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సంధిని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని గాజా పౌర రక్షణ సంస్థ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో ఘర్షణలు ఉన్నప్పటికీ కాల్పుల విరమణ మాత్రం కొనసాగుతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Rashmika : అప్పుడే చెప్తా.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ పై రష్మిక రియాక్ట్
ప్రస్తుతం శాంతి ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో ఉన్న బందీల మృతదేహాలను అప్పగిస్తోంది. మంగళవారం మరో బందీని అప్పగిస్తామని హమాస్ తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి సమయం పడుతుందని హమాస్ తెలిపింది. కానీ ఇంతలోనే హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ఇజ్రాయెల్‌కు దాడులకు దిగింది. తాజా ఘర్షణలతో మళ్లీ ఉద్రిక్తతలు మొదటికొచ్చాయి.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులకు తెగబడి 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈనెలలో ట్రంప్ మధ్యవర్తిత్వంలో గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. కానీ కొద్ది రోజులకే శాంతి ఒప్పందం గాడి తప్పింది.