ఖతార్‌లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ పదవికి ముందు వరసలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నగర మేయర్‌గా ఎన్నికైతే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను నగరంలోకి ప్రవేశిస్తే, అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీస్ శాఖను ఆదేశిస్తానని అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని నేను నేరవేర్చాలనుకుంటున్నానని అన్నారు.
అక్టోబర్ 7, 2023. ఇది ఎవ్వరూ మరిచిపోలేని తేది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. హమాస్ ఉగ్రవాదులు మెరుపు వేగంతో ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని చంపి.. ఇంకొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది.
గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గాజాను స్వాధీనం చేసుకోమని.. హమాస్ అంతమే లక్ష్యమని నెతన్యాహు చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్‌నకు శాంతి బహుమతి ఇవ్వాలని నెతన్యాహు మద్దతు కూడా ఇచ్చారు.
గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకోసం ప్రణాళికలు రచించింది. అయితే ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. స్వదేశం, విదేశం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇజ్రాయెల్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాను స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో గాజాపై మరింత పోరాటానికి ఇజ్రాయెల్ సిద్ధపడినట్లైంది.
హమాస్ అంతమే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.