ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఢిల్లీ పేలుడు కారణంగా మరోసారి పర్యటన వాయిదా పడింది. పలు కారణాల చేత ఇలా వాయిదా పడడం ఇది మూడోసారి కావడం విశేషం. అయితే తాజాగా జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ కారణంగా భద్రతా సమస్యలతో పర్యటన వాయిదా పడినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Mumbai airport: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్ట్.. దేంట్లో అంటే..!
సెప్టెంబర్ 9న నెతన్యాహు భారత్‌లో పర్యటించాల్సి ఉండగా అప్పుడు ఒకసారి రద్దైంది. సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్ కారణంగా క్యాన్సిల్ అయింది. అలాగే ఏప్రిల్‌లో కూడా ఇదే మాదిరిగా వాయిదా పడింది. తాజాగా మూడోసారి ఢిల్లీ బ్లాస్ట్‌తో వాయిదా పడింది. వచ్చే ఏడాది కొత్త తేదీని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరించనున్న మోడీ.. విశిష్టతలు ఇవే!
నెతన్యాహు 2018 జనవరిలో భారతదేశాన్ని సందర్శించారు. ఇక ప్రధాని మోడీ 2017లో టెల్ అవీవ్‌లో పర్యటించారు. యూదు రాజ్యంలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ రికార్డ్ సృష్టించారు. ఇక నెత్యన్యాహు-మోడీ మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది.
ఇక నవంబర్ 10న ఢిల్లీ బ్లాస్ట్‌లో 15 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఢిల్లీ పేలుడు తర్వాత నెతన్యాహు భారత్ పర్యటన వాయిదా పడిందని వర్గాలు తెలిపాయి.