జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని 5 శాతం పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ పెంపుతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇప్పుడు 33 నుంచి 38 శాతానికి పెరిగింది. అయితే ఇది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ కంటే తక్కువగానే ఉంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది.
త్రిపుర అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. కాగా.. తొలిరోజే తీవ్ర గందరగోళం నెలకొంది. భారతీయ జనతా పార్టీ మరియు త్రిపుర మోతా ఎమ్మెల్యేల మధ్య సభలో తీవ్ర చర్చ జరిగింది. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు టేబుల్‌పైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు.
Delhi: ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. అనేక హత్యల్లో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కాంట్రాక్ట్ కిల్లర్ కమిల్ గాయపడ్డాడు. లొంగిపోవాలని కోరినా కూడా కమిల్ పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు తిరిగి జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డారు. తరువాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 7, 8 తేదీల్లో 4 రాష్ట్రాలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ మరియు రాజస్థాన్‌లలో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో డజనుకు పైగా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్ణాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో…
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది.
రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి మధురదాస్ మాథుర్ ఆసుపత్రి ఏర్పాట్ల రహస్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. మానసిక వ్యాధి విభాగంలోని వార్డులో నలుగురు రోగుల కాళ్లను ఎలుకలు కొరికేశాయి.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ముండ్కా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాలు. అత్యాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు బ్లాక్‌మెయిలింగ్ కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు సల్మాన్. అతని వయస్సు 22 సంవత్సరాలు. ఈ అత్యాచార ఘటన జూన్ 29న చోటు చేసుకుంది.