ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం ఎన్‌డిఎ కుటుంబాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాలలోని చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే.. ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
ముంబైలోని మలాడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు బాలురులను స్థానికులు కాపాడారు. మిగితా ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
హిమాచల్ ప్రదేశ్ లో డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. డీజిల్‌పై మొత్తం వ్యాట్ రికవరీ లీటరుకు రూ.10.40కి పెరిగింది.