DA Increase: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని 5 శాతం పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ పెంపుతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇప్పుడు 33 నుంచి 38 శాతానికి పెరిగింది. అయితే ఇది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ కంటే తక్కువగానే ఉంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది. ఇది జనవరి 2023 నుండి 42 శాతానికి చేరుకుంటుంది. 7వ వేతన సంఘం కింద సంవత్సరానికి రెండుసార్లు DA సవరించబడుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకుంటే కేంద్ర ఉద్యోగులకు మరో పెంపు జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో సమావేశం కానున్నారు.
60 Snakes: అమ్మ బాబోయ్.. ఏందయ్యా ఇది.. ఆ ఇంట్లో అన్ని పాములు..
అయితే ఛత్తీస్‌గఢ్‌లో డీఏ పెంపు నిర్ణయం పట్ల ఉద్యోగులు ఓ పక్క హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోపక్క విమర్శలు చేస్తున్నారు. పెంపు నిర్ణయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి కాబట్టే డీఏ పెంచినట్లు చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా డీఏ పెంపు జరిగింది. మధ్యప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఇప్పుడు 42 శాతానికి చేరుకుంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో డీఏ పెంపు నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుంది.