విపక్షాల రెండో సమావేశం బెంగళూరులో వచ్చే నెల 13వ తేదీ, 14వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు శరద్ పవార్ తెలిపారు. బెంగుళూరులో విపక్షాల భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నేతలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవార్ వెల్లడించారు. వచ్చే నెల మధ్యలో వర్షాలు ఉధృతంగా కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షిమ్లాలో సమావేశ నిర్వహణ సరైన నిర్ణయం కాకపోవచ్చనే అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. వాతావరణ…
రుగుతున్న పప్పుల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గోధుమల వంటి బఫర్ స్టాక్ నుండి పప్పులను విక్రయించనుంది. దీంతో మార్కెట్‌లోకి కందిపప్పు రానుండటంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
వేదాంత మరియు ఫాక్స్‌కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్‌కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్‌కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది.
ముద్దుగా ప్రేమగా పెంచుకునే కుక్క కనిపించకుండాపోయిందని ఓ మున్సిపల్ కమిషనర్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంది. ఆదివారం సాయంత్రం నుండి కనపడకపోవడంతో.. పోలీసులు జల్లెడ పడుతున్నారు. విశ్రాతి లేకుండా 500 ఇళ్లలో సోదాలు జరిపారు. అయినప్పటికీ ఆ కుక్క ఆచూకీ దొరకలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్‌వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి…
Hospital staff made to go home half-naked for asking to take off shoes: డాక్టర్ ఛాంబర్‌లోకి వెళ్లే ముందు డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) భార్య చెప్పులు తీయమని చెప్పడం వల్ల తన జీవితంలో దారుణమైన అవమానం ఎదురవుతుందని రైల్వే హాస్పిటల్ అటెండర్ ఎప్పుడూ అనుకుని ఉండరు. ఈ విషయంపై డీఆర్‌ఎం పగబట్టి అతని బట్టలు తీయించి అర్ధనగ్నంగా ఇంటికి వెళ్ళేలా చేశాడు. ఈ అవమానానికి కుంగిపోయిన సదరు అటెండర్ డిప్రెషన్‌లోకి వెళ్లి…
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.